బిజెపితో బిజెడి కటీఫ్‌

ఒడిషా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ
పదేళ్లు మద్దతు ఇచ్చినందుకు బిజెడికి బిజెపి కృతజ్ఞతలు
భువనేశ్వర్‌ : ఒడిషాలో అధికార బిజూ జనతా దళ్‌ (బిజెడి), బిజెపితో సంబంధాలు తెంచుకుంది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాలకు మే13 నుండి జూన్‌ 1 మధ్య నాలుగు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒడిషాలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన్మోహన్‌ సమల్‌ ప్రకటించారు. ‘ఈసారి, రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో బిజెపి పోటీ చేస్తుందని తెలిపారు. ‘మేం చాలా అంశాలపై మరీ ముఖ్యంగా ఒడిషా గుర్తింపు, ఒడిషా ప్రతిష్ట, ఒడిషా ప్రజల ప్రయోజనం.. వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఏకీభించడం లేదు’ అని ఆయన అన్నారు. అయితే గత పదేళ్లల్లో అనేక అంశాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు బిజెడికి ఆయన కృజత్ఞలు తెలిపారు. బిజెపి-బిజెడితో మధ్య పొత్తుపై గత 17 రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. ‘2036 నాటికి అంటే ఒడిషా రాష్ట్రం అవతరించి 100 ఏళ్లు పూర్తయ్యేనాటికి బిజెడి, ముఖ్యమంత్రి సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. వీటిని సాధించడానికి, ఒడిషా, ఒడిషా ప్రజల ప్రయోజనాల కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని బిజెడి ‘ బిజెడి ఆ ప్రకటనలో తెలిపింది. బిజెడి- బిజెపి మధ్య సంబంధాలు తెగిపోవడం ఇదే మొదటిసారి కాదు. 1998 నుంచి 2009 వరకు ఈ రెండు పార్టీలు ఎన్‌డిఎ కూటమిలో ఉన్నాయి. నవీన్‌ పట్నాయక్‌ వాజ్‌పేరు క్యాబినేట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే క్రైస్తవులపై సంఫ్‌ు పరివార్‌ హింసాత్మక దాడులకు తెగబడినప్పుడు బిజెడి, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. దీంతో 2009, 2014 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేసి దారుణంగా భంగపడింది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మరోసారి జత కట్టాయి.

➡️