రాష్ట్రంలో 113 పార్టీలు

  •  ఐదు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్ర పార్టీలు
  •  గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు 11
  •  ఒక పార్టీకి రిజర్వు సింబల్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పార్టీలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2023 జూన్‌ నాటికి రాష్ట్ర ఎన్నికల కమిషన్లో 113 పార్టీలు రిజిస్టరై ఉన్నాయి. వీటిల్లో ఐదు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్ర పార్టీలు, 11 ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలూ ఉన్నాయి. రిజిస్టరు చేసుకున్న రాజకీయ పార్టీల్లో జనసేనకు మాత్రం గ్లాసుగుర్తును కేటాయించారు.

జాతీయ పార్టీలు
భారతీయ జనతా పార్టీ, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు), ఆమ్‌ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ. వీటితోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) గుర్తింపు పొందిన పార్టీలుగా ఉన్నాయి.

గుర్తింపు పొందిన ఇతర రాష్ట్ర పార్టీలు
ఎఐఎడిఎంకె, ఆలిండియా ఫార్వార్డ్‌బ్లాక్‌, ఎఐఎంఐఎం, బిఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సిపిఐ), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, జనతాదళ్‌(సెక్యులర్‌), జనతాదళ్‌(యునైటెడ్‌), నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ.

రిజిస్టర్‌ చేసుకున్న పార్టీలు
ఆలిండియా పీపుల్‌ పార్టీ, అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఆంధ్ర చైతన్య పార్టీ, ఆంధ్ర ప్రజాశక్తి పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బిసి భారతదేశం, భారతీయ బహుజన ప్రజారాజ్యం, భారత జనలోక్‌, భారత లేబర్‌, బహుజన సమాజ్‌ (అంబేద్కర్‌-పూలే), బిఆర్‌ అంబేద్కర్‌ ప్రజాపాలన, సిపిఐఎంఎల్‌ (లిబరేషన్‌), దళిత బహుజన, ఏక్తాపార్టీ, గోండ్వానా గణతంత్ర, గ్రామస్వరాజ్య, గ్రేట్‌ ఇండియా, గ్రేట్‌ రాయలసీమ, హిందూస్థాన్‌ జనతా, ఇండియన్‌ క్రిస్టియన్‌, ఇండియన్‌ లేబర్‌ (అంబేద్కర్‌, ఫూలే), ఇండియన్స్‌ ఫ్రంట్‌, జై మహా భారత్‌, జై సమైక్యాంధ్ర, జనపాలన (డెమొక్రటిక్‌), జనరక్షణ, జనం, జన ప్రయోజన, జాతీయ సమసమాజం, ఇందిరా రాజీవ్‌ కాంగ్రెస్‌, లోక్‌సత్తా, మాదేశం, మహా జనరాజ్యం, మహిళా జనశక్తి, మజ్లిస్‌ బచావో తెహ్రిక్‌, మన్యసీమ స్వతంత్ర, నేషనల్‌ ఉమెన్స్‌, ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం (లక్ష్మీపార్వతి), నవభారత్‌, నవతరం, నవసమాజ్‌, నవసమాజం, నవప్రజారాజ్యం, నవరంగ్‌ కాంగ్రెస్‌, నవోదయం, పరమాత్మ, పేదరికం నిర్మూలన, ప్రజాబలం, ప్రజాపక్షం, ప్రజాసత్తా, ప్రజా తెలుగుసమితి, ప్రజా ఉద్యోగ, పిరమిడ్‌, ప్రజాభారత్‌, ప్రేమ్‌జనతా, ఖవామీఇత్తెహదుల్‌ రిపబ్లిక్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌, రాయలసీమ రాష్ట్ర సమితి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, సామాన్య పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, సమైక్య తెలుగురాజ్యం, సామాజిక తెలంగాణ, సమైక్యాంధ్ర సమితి, శ్రమజీవి, సోషల్‌ డెమొక్రటిక్‌, సోషల్‌ వెల్ఫేర్‌, తెలంగాణ భారత జనతా, తెలంగాణ రాజ్యసమితి, తెలంగాణ పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ కాంగ్రెస్‌, తెలంగాణ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌, తెలంగాణ ఐక్యజన, తెలంగాణ లేబర్‌, తెలంగాణ లోక్‌సత్తా, తెలంగాణ సకలజనులు, తెలంగాణ యువసేన, తెలుగుధర్మం, తెలుగుజనత, యునైటెడ్‌ ఉమెన్‌ ప్రంట్‌, ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి, వక్త ప్రజా సమస్యల సాధన, వెనుకబడినవర్గాల మహిళా రైతు, విద్యార్థులు, మహిళల, రైతుల మహాసేన, వెల్ఫేర్‌ పార్టీ, వైఎస్‌ఆర్‌ బహుజన, వైఎస్‌ఆర్‌ ప్రజాపార్టీ, యువ తెలంగాణ పార్టీలు ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్‌ చేసుకుని ఉన్నాయి.

➡️