భద్రలో లక్ష, మరో మూడు స్థానాల్లో 50వేలకు పైగా ఓట్లు

  • రాజస్థాన్‌లో సిపిఎం సాధించిన ఓట్ల వివరాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లో బిజెపి గాలిని తట్టుకుని భద్ర నియోజకవర్గంలో లక్ష ఓట్లు, మరో మూడు నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా ఓట్లు సిపిఐ(ఎం) అభ్యర్థులు సాధించారు. గతంలో ఉన్న రెండు స్థానాలను నిలబెట్టుకునేందుకు గట్టిగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మొత్తం 17 స్థానాల్లో సిపిఎం పోటీ చేసి చేయగా రెండు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉండగా, అందులో ఒక స్థానంలో స్వల్ప ఓట్ల (1,132) తేడాతో సిపిఐ(ఎం) అభ్యర్థి ఓడిపోయారు. గత ఎన్నికల్లో భద్ర, దంగర్‌గఢ్‌ స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి ఆ రెండు స్థానాల్లోనూ బిజెపి గెలిచింది. భద్ర నియోజకవర్గం నుంచి బల్వన్‌ పునియా 1,01616 ఓట్లు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన ఆయన కేవలం 1,132 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో 81,655 ఓట్లు లభించగా, ఈ ఎన్నికల్లో లక్ష వరకూ సాధించినా, స్వల్ప తేడాతో ఫలితం తారుమారైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి 3,771 ఓట్లతో ఐదో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఓట్లు ఫలితాన్ని మార్పు చేశాయి. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు 37,574 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో అవి బిజెపి వైపు మళ్లినట్లు విమర్శలున్నాయి. థాడ్‌ నియోజకవర్గం నుంచి పేమారామ్‌ 72,165 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. శ్యోపత్‌ రామ్‌ (రైసింగ్‌నగర్‌) 61,057 ఓట్లు, గిరిధరీలాల్‌ (దుంగార్గ్‌) 55,981 ఓట్లతో మూడో స్థానాల్లో నిలిచారు.

సిపిఎం అభ్యర్థులు సాధించిన ఓట్లు

బల్వన్‌ పునియా (భద్ర) 1,01616 ఓట్లు, పేమారామ్‌ (థాడ్‌) 72,165 ఓట్లు,శ్యోపత్‌ రామ్‌ (రైసింగ్‌నగర్‌) 61,057 ఓట్లు, గిరిధరీలాల్‌ (దుంగార్గ్‌) 55,981 ఓట్లు, మంగేజ్‌ చౌదరి (నోహర్‌) 24,601 ఓట్లు, అమ్రారామ్‌ (డంతరామ్‌ ఘడ్‌) 20,891 ఓట్లు, నిర్మల్‌ కుమార్‌ (తారానగర్‌) 6,755 ఓట్లు, శోభాసింగ్‌ (అనుప్‌ ఘడ్‌) 8,886 ఓట్లు, సునీల్‌ కుమార్‌ (సదుల్పూర్‌) 5,657 ఓట్లు, భగీరథ మాల్‌ (లడ్నున్‌) 5,512 ఓట్లు, ప్రేమ్‌చంద్‌ పర్గీ (ఝాడోల్‌) 4,517 ఓట్లు, రఘువీర్‌ సింగ్‌ (హనుమన్‌ఘడ్‌) 2,828 ఓట్లు, గోటమ్‌లాల్‌ (దుంగార్‌పూర్‌) 2,318 ఓట్లు, ఛగన్‌లాల్‌ చౌదరి (సర్దార్‌షహర్‌) 1,942 ఓట్లు, ఉస్మాన్‌ గనీ (సికర్‌) 1,760 ఓట్లు, వీజేంద్ర థాకా (లచ్మాన్‌గఢ్‌) 1,202 ఓట్లు, కనరం (నవన్‌) 1,095 ఓట్లు

ఛత్తీస్‌గఢ్‌లో…

ఛత్తీస్‌గఢ్‌లో మూడు స్థానాల్లో సిపిఎం పోటీ చేసింది. కట్ఘోరా నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జవహర్‌ సింగ్‌ కన్వర్‌కు 2,535 ఓట్లు వచ్చాయి. భట్గావ్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కపిల్‌ దేవ్‌ పైక్రాకు 2,018 ఓట్లు వచ్చాయి. లుండ్రా నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బల్బీర్‌ నగేష్‌కు 2,041 ఓట్లు వచ్చాయి.

➡️