ఆంధ్రతో కేరళ ఢీ

Feb 15,2024 22:10 #Sports

రంజీట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో కేరళతో తలపడనుంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు విశాఖపట్నంలోని విడిఏ-ఎసిడిఏ వేదికగా శుక్రవారం నుంచి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ సీజన్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ముంబయి చేతిలో మినహా మిగిలిన అన్ని జట్లపైనా అద్భుత ప్రదర్శనను కనబరిచింది. బెంగాల్‌, యుపిలతో మ్యాచ్‌లను డ్రా చేసుకున్నా.. అస్సాం, ఛత్తీస్‌గడ్‌లపై నెగ్గింది. ఇక బీహార్‌పై ఇన్నింగ్స్‌ 157పరుగుల తేడాతో నెగ్గి క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ సాధించింది. మొత్తం 25పాయింట్లతో ముంబయి తర్వాత 2వ స్థానంలో నిలిచి రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో ఉన్న కేరళ 6మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. మిగిలిన మ్యాచ్‌లన్నీ డ్రా అయ్యాయి. ప్లేట్‌ గ్రూప్‌లో ఫైనల్‌కు చేరి హైదరాబాద్‌-మేఘాలయ జట్ల మధ్య మ్యాచ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

➡️