ఆంధ్ర 431ఆలౌట్‌ ..ఛత్తీస్‌గడ్‌తో రంజీట్రోఫీ

Jan 27,2024 22:03 #Sports

రాయ్ పూర్‌: ఛత్తీస్‌గడ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 431పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 277పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టును మాజీ కెప్టెన్‌ హనుమ విహారి(183) ఆదుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ గిరినాథ్‌(36), శశికాంత్‌(42) బ్యాటింగ్‌లో రాణించారు. ఛత్తీస్‌గడ్‌ బౌలర్లు రవికిరణ్‌కు ఏడు, సౌరభ్‌ మజుందార్‌కు రెండు, వాసుదేవ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఛత్తీస్‌గడ్‌ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 118పరుగులు చేసింది. రిషబ్‌(38), అశోతోష్‌(23) బ్యాటింగ్‌లో రాణించారు. క్రీజ్‌లో కెప్టెన్‌ అమన్‌దీప్‌(28), సంజీత్‌(12) ఉన్నారు. ఆంధ్ర బౌలర్లు గిరినాథ్‌కు రెండు, నితీశ్‌కు ఒక వికెట్‌ దక్కాయి.ఇన్నింగ్స్‌ తేడాతో హైదరాబాద్‌ గెలుపు.. ప్లేట్‌ గ్రూప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌పై హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్‌ 187పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 529పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు 4వికెట్ల నష్టానికి 615పరుగుల వద్దవిన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. దీంతో 443పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అరుణాచల్‌రపదేశ్‌ జట్టు 256పరుగులకు ఆలౌటైంది. దివ్యాంషు)91), డోరియ(51) అర్ధసెంచరీలతో రాణించగా.. హైదరాబాద్‌ బౌలర్లు సాయిరాం, త్యాగరాజన్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టు 172పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

➡️