ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ -24 మందితో టీమిండియా స్క్వాడ్‌

Feb 1,2024 22:20 #Sports

భువనేశ్వర్‌: ప్రతిష్ఠాత్మక ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ-లీగ్‌ 2023-24కు హాకీ ఇండియా(హెచ్‌ఐ) పటిష్ఠ జట్టును ప్రకటించింది. భువనేశ్వర్‌లోని రూర్కెలాలో జరిగే ఈ టోర్నీ కోసం 24మందితో కూడిన పురుషుల జట్టును హెచ్‌ఐ ఎంపిక చేసింది. ఇద్దరు గోల్‌ కీపర్లు, ఏడుగురు డిఫెండర్లు, ఎనిమిది మంది మిడ్‌ ఫీల్డర్లు, ఏడుగురు ఫార్వర్డ్స్‌తో కూడిన స్క్వాడ్‌ను గురువారం వెల్లడించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా, హార్దిక్‌ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ బృందంలో అరిజీత్‌ సింగ్‌ హుందాల్‌, విష్ణుకాంత్‌ సింగ్‌ చోటు దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో టీమిండియా బలమైన స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో తలపడనుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో నెదర్లాండ్స్‌కు చెందిన హెర్మస్‌ క్రూయిస్‌ను ఈమధ్యే హై పర్మార్మెన్స్‌ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. తొలి ఎడిషన్‌లో భువనేశ్వర్‌లో ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన స్పెయిన్‌ను ఢకొీట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి రూర్కెలా వేదికగా టోర్నీ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న ఫైనల్‌ మ్యాచ్‌ ఉండనుంది.

గోల్‌ కీపర్లు : శ్రీజేష్‌ పరట్టు రవీంద్రన్‌, కృష్ణన్‌ బహదూర్‌ పాఠక్‌.

డిఫెండర్లు : జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సుమిత్‌, జుగ్‌రాజ్‌ సింగ్‌, అమిత్‌ రొహిదాస్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(కెప్టెన్‌), వరుణ్‌ కుమార్‌, సంజయ్, విష్ణుకాంత్‌ సింగ్‌.

మిడ్‌ఫీల్డర్లు : హార్దిక్‌ సింగ్‌(వైస్‌ కెప్టెన్‌), వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, షంషేర్‌ సింగ్‌, రాజ్‌కుమార్‌ పాల్‌, రవిచంద్ర సింగ్‌.ఫార్వర్డ్స్‌ : లలిత్‌ కుమార్‌ ఉపాధ్యారు, మందీప్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌, అభిషేక్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, అరైజిత్‌ సింగ్‌.

➡️