కర్రన్‌ కేక…ఢిల్లీపై నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్‌ గెలుపు

Mar 23,2024 22:25 #Sports

ఛండీగడ్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ా17 తొలి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్‌ సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి పంజాబ్‌ బోణీ కొట్టింది. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌(63) అర్ధ సెంచరీకి తోడు.. లివింగ్‌ స్టోన్‌(38నాటౌట్‌) ఆఖరి దాకా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సామ్‌ కరన్‌తో జతకలిసిన లివింగ్‌స్టోన్‌ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(22), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(26)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. అయితే.. వందకే నాలుగు వికెట్లు పడిన దశలో సామ్‌ కరన్‌(63) లివింగ్‌స్టోన్‌(38 నాటౌట్‌)లు బౌండరీలతో ఢిల్లీపై విరుచుకుపడ్డారు. ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. సుమిత్‌ కుమార్‌ రెండు వైడ్స్‌ వేశాడు. నాలుగో బంతికి లివింగ్‌స్టోన్‌ భారీ సిక్సర్‌ బాది పంజాబ్‌ను గెలిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అభిషేక్‌ పొరెల్‌(31నాటౌట్‌; 10 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. ఢిల్లీ టాప్‌ బ్యాటర్స్‌ షారు హోప్‌(33), డేవిడ్‌ వార్నర్‌(29), అక్షర్‌ పటేల్‌(21)లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ సారథి రిషభ్‌ పంత్‌ 18 పరుగులకే వెనుదిరిగాడు. పంజాబ్‌ బౌలర్ల ధాటికి ఒకదశలో పంత్‌ సేన స్కోర్‌ 150 దాటడమే కష్టమనుకున్న పరిస్థితుల్లో అభిషేక్‌ విధ్వంసం సృష్టించాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన 20వ ఓవర్‌లో ఐదు బంతుల్ని వరుసగా 4, 6, 4, 4, 6గా మలిచాడు. దాంతో ఢిల్లీ స్కోర్‌ 170 దాటింది. పంజాబ్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌లు తలా రెండేసి వికెట్లు తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సామ్‌ కర్రన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి)జితేశ్‌ శర్మ (బి)హర్షల్‌ పటేల్‌ 28, మిఛెల్‌ మార్ష్‌ (సి)రాహుల్‌ చాహర్‌ (బి)ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 20, హోప్‌ (సి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి)రబడా 33, పంత్‌ (సి)బెయిర్‌స్టో (బి)హర్షల్‌ పటేల్‌ 18, రికీ బురు (సి)జితేశ్‌ శర్మ (బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3, స్టబ్స్‌ (సి)శశాంక్‌ సింగ్‌ (బి)రాహుల్‌ చాహర్‌ 5, అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) త్యాగరాజన్‌/జితేశ్‌ శర్మ 21, సుమిత్‌ కుమార్‌ (సి)జితేశ్‌ శర్మ (బి)ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 2, అభిషేక్‌ పోరెల్‌ (నాటౌట్‌) 32, కుల్దీప్‌ యాదవ్‌ (రనౌట్‌) శశాంక్‌ సింగ్‌/హర్షల్‌ పటేల్‌ 1, అదనం 10. (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 174పరుగులు.
వికెట్ల పతనం: 1/39, 2/74, 3/94, 4/111, 5/111, 6/128, 7/138, 8/147, 9/174
బౌలింగ్‌: శామ్‌ కర్రన్‌ 1-0-10-0, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-28-2, రబడా 4-0-36-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-14-1, రాహుల్‌ చాహర్‌ 4-0-33-1, హర్షల్‌ పటేల్‌ 4-0-47-2
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి)ఇషాంత్‌ శర్మ 22, బెయిర్‌స్టో (రనౌట్‌) ఇషాంత్‌ 9, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి)వార్నర్‌ (బి)కుల్దీప్‌ 26, శామ్‌ కర్రన్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 63, జితేశ్‌ శర్మ (స్టంప్‌) పంత్‌ (బి)కుల్దీప్‌ 9, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 38, శశాంక్‌ సింగ్‌ (సి)పంత్‌ (బి)ఖలీల్‌ అహ్మద్‌ 0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 2, అదనం 8. (19.2ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 177పరుగులు.
వికెట్ల పతనం: 1/34, 2/42, 3/84, 4/100, 5/167, 6/167
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-43-2, ఇషాంత్‌ శర్మ 2-0-16-1, మిఛెల్‌ మార్ష్‌ 4-0-52-0, అక్షర్‌ పటేల్‌ 4-0-25-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-2, సుమిత్‌ కుమార్‌ 1.2-0-19-0

➡️