కర్రసాము పోటీల్లో గన్నవరం విద్యార్థుల ప్రతిభ – బంగారు పతకాల సాధన

Nov 28,2023 22:01 #Sports

ప్రజాశకి-్తగన్నవరం ( కృష్ణాజిల్లా)జాతీయ స్థాయి సిలబం(కర్రసాము) పోటీల్లో కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తా చాట్టారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో జరిగిన 4వ జాతీయస్థాయి సిలంబం పోటీల్లో గన్నవరం విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు గన్నవరంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో విజేతల అభినందన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు డి ఝాన్సీ రాణి మాట్లాడుతూ… జాతీయస్థాయి సిలంబం పోటీలు ఈ నెల 24 నుండి 26వరకు విజయవాడ రాజీవ్‌నగర్‌లోని మాస్టర్‌ మైండ్‌ స్కూల్‌ ఆవరణలో జరిగినట్లు తెలిపారు. అండర్‌ 12 బాలుర సింగిల్‌ స్టిక్‌ విభాగంలో మానికొండ సాయి ప్రశాంత్‌ కాంస్య పతకం, సింగిల్‌ స్టిక్‌ ఫైట్‌ విభాగంలో బంగారు పతకం సాధించారని తెలిపారు. అండర్‌ 14 బాలికల సింగిల్‌ స్టిక్‌ ఫైట్‌ విభాగంలో మానికొండ సాయి సత్యచిన్మయి రజిత పతకం, సింగిల్‌ స్టిక్‌ ఫైట్‌ విభాగంలో బంగారపు పతకం సాధించారని తెలిపారు. కర్రసాము పోటీల్లో బంగారు పతకాలు సాధించినందుకు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పిడి కె గీత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️