జైస్వాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు

Mar 12,2024 22:18 #Sports

దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో దుమ్మురేపిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ మరో ఘనత సాధించాడు ఐసిసి ప్రతి నెలా ప్రకటించే అవార్డుకు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి నెలకుగానూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డును జైస్వాల్‌ గెలుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో 22ఏళ్ల జైస్వాల్‌ రెండు డబుల్‌ సెంచలు, మరో రెండు అర్ధసెంచరీల సాయంతో 712పరుగులతో సత్తా చాటాడు. అలాగే టెస్ట్‌లో అత్యధికంగా సిక్సర్లు(12) కొట్టిన తొలి ఆటగానిగా రికార్డు నెలకొల్పి ఫ్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. జైస్వాల్‌ రాణించడంతో భారతజట్టు తొలి టెస్ట్‌ ఓడినా.. సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకోవడం విశేషం. మహిళల విభాగంలో ఆసీస్‌ క్రికెటర్‌ అనాబెల్‌ సథర్‌లాండ్‌ ఈ పురస్కారం దక్కించుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో సథర్‌లాండ్‌ డబుల్‌ సెంచరీతో సత్తా చాటింది. ఓటింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకలను వెనక్కి నెట్టి మరీ యశస్వి ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఐసిసి అవార్డు దక్కినందుకు సంతోషంగా ఉంది.. రాబోయే టోర్నీలోనూ ఇలాంటి అవార్డులు మరెన్నో సాధిస్తానని యశస్వి పేర్కొన్నాడు.

➡️