జైస్వాల్‌, సూర్యకుమార్‌ నామినేట్‌-ఐసిసి 2023 అవార్డులు

Jan 3,2024 22:15 #Sports

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) పురుషుల టి20 క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ా2023 ఏడాదికి భారత్‌ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జూస్వాల్‌ నామినేట్‌ అయ్యారు. సూర్యకుమార్‌తోపాటు మరో నలుగురు టి20 క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో ఉండగా.. ఐసిసి ఎమర్జింగ్‌ పురుషుల క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌2023కు జైస్వాల్‌ నామినేట్‌ అయ్యాడు. 2023లో 33ఏళ్ల సూర్యకుమార్‌ యాదవ్‌ 17 టి20ల్లో 48.86సగటు, 155.95స్ట్రైక్‌రేట్‌తో 733పరుగులు చేశాయి. అలాగే 2017లో శ్రీలంకపై కేవలం 35బంతుల్లో సెంచరీ కొట్టిన రికార్డుకు చేరువై రెండో వేగవంతమైన సెంచరీని సూర్యకుమార్‌ యాదవ్‌ సాధించాడు. మిగిలిన ముగ్గురు జింబాబ్వే సికిందర్‌ రాజా, ఉగండాకు చెందిన ఉల్ఫేష్‌ రంజానీ, న్యూజిలాండ్‌కు చెందిన మార్క్‌ ఛాప్మన్‌. ఇక ఎమర్జింగ్‌ క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో ఉన్న యశస్వి జైస్వాల్‌తోపాటు రచిన్‌ రవీంద్ర(న్యూజిలాండ్‌), జెరాల్డ్‌ కోయెట్జీ(దక్షిణాఫ్రికా), దిల్షాన్‌ మధుశంక(శ్రీలంక) అవార్డు రేసులో ఉన్నారు. ఇక మహిళల విభాగంలో చమరి ఆటపట్టు(శ్రీలంక), సోఫీ ఎక్లేస్టోన్‌(ఇంగ్లండ్‌), హీలీ మాథ్యూస్‌(వెస్టిండీ)తోపాటు 2017, 2019లో ఐసిసి మహిళా క్రికెట్‌ ఆఫ్‌ ది ఆయర్‌ అవార్డు విజేత టైటిల్‌ నెగ్గిన ఎల్లీస్‌ ఫెర్రీ(ఆస్ట్రేలియా) ఉన్నారు. ఇక ఎమర్జింగ్‌ ఉమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు మారుఫా అక్తర్‌(బంగ్లాదేశ్‌), లారెన్‌ బెల్‌(ఇంగ్లండ్‌), డార్ఫీ కార్టర్‌(స్కాట్లాండ్‌), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌(ఆస్ట్రేలియా) ఎంపికయ్యారు.

➡️