టీ20 వరల్డ్‌కప్‌ వరకు రాహుల్‌ ద్రవిడే టీమిండియా కోచ్‌ :  జై షా

Feb 15,2024 15:46 #Cricket, #rahul dravid, #World Cup

ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రాజ్‌కోట్‌ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్‌కు ముందు షా మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌ ముగిశాక ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదని.. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కావడంతో ద్రవిడ్‌తో ఎలాంటి మాటామంతి జరపలేదన్నారు. రాజ్‌కోట్‌ టెస్ట్‌కు ముందు ద్రవిడ్‌తో మాట్లడే అవకాశం దొరకడంతో టీ20 వరల్డ్‌కప్‌ వరకు అతన్నే కోచ్‌గా కొనసాగాలని కోరామన్నారు. అందుకు ద్రవిడ్‌ కూడా సానుకూలంగానే స్పందించాడని తెలిపారు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌లో రాణిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. . ద్రవిడ్‌తో పాటు సహాయక కోచింగ్‌ సిబ్బంది మొత్తం వరల్డ్‌కప్‌ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు.

➡️