రోహిత్‌, శుభ్‌మన్‌ సెంచరీలు

Mar 8,2024 22:15 #Sports

– భారత్‌ 473/8

– 255పరుగుల ఆధిక్యత

ధర్మశాల: చివరి, ఐదోటెస్ట్‌లోనూ టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరికి తోడు సర్ఫరాజ్‌ ఖాన్‌, దేవదత్‌ పటీధర్‌ కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత లభించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ (27), జస్‌ప్రీత్‌ బుమ్రా (19) ఉన్నారు. అంతకుముందు రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110) సెంచరీలతో కదం తొక్కారు. యశస్వి జైస్వాల్‌ (57), దేవదుత్‌ పడిక్కల్‌ (65), సర్ఫరాజ్‌ ఖాన్‌(56) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. పరుగులను నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 255 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌లో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 135 పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన టీమిండియాను రోహిత్‌, గిల్‌ 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. చాలా రోజుల తర్వాత బౌలింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలి బంతికే రోహిత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే, స్వల్ప వ్యవధిలో రోహిత్‌-గిల్‌ ఔట్‌ కావడంతో టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడినట్లు అనిపించినా కోలుకోగలిగింది. అరంగేట్ర బ్యాటర్‌ దేవదుత్‌ పడిక్కల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దీంతో తొలి ఐదుగురు బ్యాటర్లు 50ం స్కోర్లు చేయడం విశేషం. మరోసారి ఇంగ్లాండ్‌ బౌలర్లు విజఅంభించి పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌ (15), రవీంద్ర జడేజా (15), రవిచంద్రన్‌ అశ్విన్‌ (0)ను ఔట్‌ చేశారు. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడం గమనార్హం. అయితే, కుల్‌దీప్‌ యాదవ్‌ – జస్‌ప్రీత్‌ బుమ్రా క్రీజ్‌లో పాతుకుపోయారు. ఇప్పటికే తొమ్మిదో వికెట్‌కు 108 బంతుల్లో 45 పరుగులు జోడించారు.

స్కోర్‌బోర్డు…

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 218పరుగులు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (స్టంప్‌)ఫోక్స్‌ (బి)బషీర్‌ 57, రోహిత్‌ శర్మ (బి)స్టోక్స్‌ 103, శుభ్‌మన్‌ (బి)ఆండర్సన్‌ 110, పడిక్కల్‌ (బి)బషీర్‌ 65, సర్ఫరాజ్‌ ఖాన్‌ (సి)రూట్‌ (బి)బషీర్‌ 56, జడేజా (ఎల్‌బి)హార్ట్‌లీ 15, ధృవ్‌ జురెల్‌ (సి)డకెట్‌ (బి)బషీర్‌ 15, అశ్విన్‌ (బి)హార్ట్‌లీ 0, కుల్దీప్‌ (బ్యాటింగ్‌) 27, బుమ్రా (బ్యాటింగ్‌) 19, అదనం 8. (120 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 473పరుగులు.

వికెట్ల పతనం: 1/104, 2/275, 3/279, 4/376, 5/403, 6/427, 7/427, 8/428

బౌలింగ్‌: ఆండర్సన్‌ 14-1-59-1, వుడ్‌ 15-1-89-0, హార్ట్‌లీ 39-3-126-2, బషీర్‌ 44-5-170-4, స్టోక్స్‌ 5-1-17-1, రూట్‌ 3-0-8-0

➡️