వెస్టిండీస్‌ 188ఆలౌట్‌

Jan 17,2024 22:20 #Sports

ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్‌

ఆడిలైట్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో ఆసీస్‌ బౌలర్లు కదం తొక్కారు. హేజిల్‌వుడ్‌, కెప్టెన్‌ కమిన్స్‌ నిప్పులు చెరిగే బంతులకు విండీస్‌ జట్టు 62.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూల్చింది. ఆసీస్‌ బౌలర్లలో సారథి పాట్‌ కమిన్స్‌, జోష్‌ హెజిల్‌వుడ్‌లు తలా నాలుగు వికెట్లతో చెలరేగారు. విండీస్‌ జట్టులో క్రిక్‌ మెకంజీ(50) అర్థ సెంచరీతో రాణించాడు. డేవిడ్‌ వార్నర్‌ రిటైర్మెంట్‌ తర్వాత తొలిసారి ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన స్టీవ్‌ స్మిత్‌.. ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్‌.. ఆసీస్‌ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కమిన్స్‌ వేసిన పదో ఓవర్లో ఆ జట్టు ఓపెనర్‌ చందర్‌పాల్‌ (6) వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా వికెట్లను నష్టపోయింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌లలో మెకంజీ మినహా ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా చేయలేకపోయాయరు. ఆఖరి వరుస బ్యాటర్‌ షెమర్‌ జోసెఫ్‌.. 41 బంతుల్లో 36 పరుగులు చేయడంతో విండీస్‌.. 188 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌.. 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. వార్నర్‌ పొజిషన్‌ను భర్తీ చేస్తున్న స్మిత్‌.. కొత్త కుర్రాడు సెమర్‌ జోసెఫ్‌ వేసిన తొలి ఓవర్‌ (ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌)లో మొదటి బంతికే అతడిని పెవిలియన్‌కు పంపాడు. షెమర్‌ కు ఇదే తొలి టెస్టు కావడం గమనార్హం. అనంతరం షెమర్‌.. లబూషేన్‌ (10)నూ ఔట్‌ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌.. 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్‌ ఖవాజా (30 నాటౌట్‌), కామెరూన్‌ గ్రీన్‌ (6)లు క్రీజులో ఉన్నారు.

 

➡️