2024లోనూ ససెక్స్‌ క్లబ్‌తో పుజరా ఒప్పందం

Dec 13,2023 22:10 #Sports

ముంబయి: టీమిండియా సీనియర్‌ టెస్ట్‌ బ్యాటర్‌ ఛటేశ్వర పుజరా 2024 ఏడాదిలోనూ కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్‌లోని ససెక్స్‌ క్లబ్‌ ట్విటర్‌ వేదికగా.. పుజరాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 2022లో తొలిసారి ససెక్స్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చునున్న పుజారా.. వరుసగా మూడో ఏడాదీ అదే క్లబ్‌ తరఫున ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పుజరా ససెక్స్‌ తరఫున 18 ఇన్నింగ్స్‌లో 64.24 సగటుతో 1,863పరుగులు చేశాడు. ఇందులో 8సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇందులో డర్భీషైర్‌పై 231 పరుగుల అత్యధిక స్కోర్‌ చేయడంతోపాటు టామ్‌ హైన్స్‌తో కలిసి 351పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 2022 ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భారతజట్టు ఓటమి తర్వాత టెస్ట్‌ల్లో చోటు దక్కని పుజరా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.

➡️