విజృంభించిన నరైన్‌

May 6,2024 01:06 #Cricket, #ipl 2024, #Sports
  • లక్నోపై 98పరుగుల తేడాతో కోల్‌కతా గెలుపు

లక్నో: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 98పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్‌ బెర్తుకు మరింత చేరువైంది. కోల్‌కతా నిర్దేశించిన 236పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అర్నిశ్‌ కులకర్ణి(9) వికెట్‌ కోల్పోయింది. దీంతో లక్నో 20 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(25), మార్కస్‌ స్టోయినిస్‌(36)లు ఆదుకోవడంతో లక్నో పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. రస్సెల్‌ తన తొలి ఓవర్లోనే స్టోయినిస్‌ను ఔట్‌ చేసి లక్నోను మరింత ఒత్తిలోకి నెట్టాడు. 85కే నాలుగు వికెట్లు పడిన వేళ.. నికోలస్‌ పూరన్‌(10), కుర్రాడు ఆయుష్‌ బదొని(15)లు.. జట్టు స్కోర్‌ వంద దాటించారు. అయితే.. 101 రన్స్‌ వద్ద రస్సెల్‌ డేంజరస్‌ పూరన్‌ను డగౌట్‌కు పంపాడు. అంతే.. అక్కడితో లక్నో ఓటమి ఖారారైంది. చివర్లో అష్టన్‌ టర్నర్‌(16), కృనాల్‌ పాండ్యా(5) చక్రవర్తి, రానాలు కళ్లెం వేశారు. 16.1 ఓవర్‌లో రవి బిష్ణోరును రానా ఎల్బీగా ఔట్‌ చేయడంతో కోల్‌కతా విజయం లాంఛనమైంది.
తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. నరైన్‌ కేవలం 39బంతుల్లో 6ఫోర్లు, 7సిక్సర్ల సాయంతో 81పరుగులకు తోడు మరో ఓపెనర్‌ సాల్ట్‌(32; 14బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) ధనా ధన్‌ బ్యాటింగ్‌తో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీస్కోర్‌ చేసింది. సునీల్‌ నరైన్‌ అర్ధసెంచరీకి తోడు రమణ్‌దీప్‌(25) మెరుపులు మెరిపించడంతో పాటు రఘువంశీ(32), శ్రేయస్‌ అయ్యర్‌(23) తమవంతు సహకారం అందించారు. ఓపెనర్లు రాణించడంతో కోల్‌కతా కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ మరోసారి నిరాశపరిచాడు. 11 బంతుల్లో రెండు ఫోర్లతో కేవలం 16 పరుగులే చేసి ఔటయ్యాడు. కానీ.. చివర్లో రమణ్‌దీప్‌ లక్నో బౌలర్లకు మాత్రం చుక్కలు చూపించాడు. కేవలం ఆరు బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 25 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 235పరుగులు చేసింది. లక్నో బౌలర్లు నవీన్‌-ఉల్‌-హక్‌కు మూడు, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోరు, యుధ్‌వీర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)రాహుల్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 32, నరైన్‌ (సి)పటీధర్‌ (బి)రవి బిష్ణోరు 81, రఘువంశీ (సి)రాహుల్‌ (బి)యుద్‌వీర్‌ సింగ్‌ 32, రస్సెల్‌ (సి)గౌతమ్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 12, రింకు సింగ్‌ (సి)స్టొయినీస్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 16, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)రాహుల్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 23, రమణ్‌దీప్‌ సింగ్‌ (నాటౌట్‌) 25, వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 1, అదనం 13. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 235పరుగులు. వికెట్ల పతనం: 1/61, 2/140, 3/167, 4/171, 5/200, 6/224 బౌలింగ్‌: స్టొయినీస్‌ 2-0-29-0, మొహిసన్‌ ఖాన్‌ 2-0-28-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 4-0-49-3, యశ్‌ ఠాకూర్‌ 4-0-46-1, కృనాల్‌ పాండ్య 2-0-26-0, రవి బిష్ణోరు 4-0-33-1, యుధ్‌వీర్‌ సింగ్‌ 2-0-24-1.
లక్నో ఇన్నింగ్స్‌: కెఎల్‌ రాహుల్‌ (సి)రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)హర్షీత్‌ రాణా 25, కులకర్ణి (సి)రమణ్‌దీప్‌ సింగ్‌ (బి)స్టార్క్‌ 9, స్టొయినీస్‌ (సి)హర్షీత్‌ రాణా (బి)రస్సెల్‌ 36, దీపక్‌ హుడా (ఎల్‌బి)చక్రవర్తి 5, పూరణ్‌ (సి)సాల్ట్‌ (బి)రస్సెల్‌ 10, ఆయుష్‌ బడోని (సి)స్టార్క్‌ (బి)నరైన్‌ 15, టర్నర్‌ (సి అండ్‌ బి) చక్రవర్తి 16, కృనాల్‌ పాండ్య (సి)సాల్ట్‌ 9బి)హర్షీత్‌ రాణా 5, యుధ్‌వీర్‌ చాహక్‌ (సి)రస్సెల్‌ (బి)చక్రవర్తి 7, రవి బిష్ణోరు (ఎల్‌బి)హర్షీత్‌ రాణా 2, నవీన్‌-ఉల్‌-హక్‌ (నాటౌట్‌) 0, అదనం 7. (16.1ఓవర్లలో ఆలౌట్‌) 137పరుగులు. వికెట్ల పతనం: 1/20, 2/70, 3/77, 4/85, 5/101, 6/109, 7/125, 8/129, 9/137, 10/137 బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2-0-21-0, స్టార్క్‌ 2-0-22-1, నరైన్‌ 4-0-22-1, నిహర్షీత్‌ రాణా 3.1-0-24-3, వరణ్‌ చక్రవర్తి 3-0-30-3, రస్సెల్‌ 2-0-17-2.

➡️