అమన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరం

Apr 19,2024 22:47 #Sports

బిష్కెక్‌(కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ అమన్‌ షెహ్రావత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. ఆసియా ఒలింపిక్‌ రెజ్లింగ్‌ క్వాలిఫికేషన్‌ పోటీల్లో శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో అమన్‌ ఓటమిపాలవ్వడంతో ఒలింపిక్‌ బెర్త్‌ దూరమైంది. పురుషుల 57కిలోల విభాగం ఆసియా ఛాంపియన్‌ అయిన అమన్‌.. స్థానిక ఆటగాడు ముక్తోర్లీ చేతిలో 10ా0పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. అంతకుముందు పోటీలోనూ అమన్‌ కొరియాకు చెందిన సాంగ్వాన్‌ కిమ్‌ చేతిలో 11ా1పాయింట్ల ఓటమిపాలవ్వడంతో అమన్‌ సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో అమన్‌ ఏడోస్థానంలో నిలిచాడు. ఇక 74కిలోల విభాగంలో జైదీప్‌ కజకిస్తాన్‌కు చెందిన ఓరోజోబెక్‌ చేతిలో 2ా2తో డ్రా చేసుకోగా.. 97కిలోల విభాగంలో దీపక్‌ నెహ్రా 10ా0తో జపాన్‌కు చెందిన ఆరాష్‌ యోషిదాపై, 125కిలోల విభాగంలో సుమిత్‌ 10ా0తో మంగోలియా రెజ్లర్‌ను చిత్తుచేశారు. ఇక సుజిత్‌ కల్కల్‌(65కిలోలు), దీపక్‌ పునియా(86కిలోలు) పోటీల ప్రారంభం నాటికి చేరుకోలేక పోటీలకు దూరమయ్యారు.

➡️