అమీ జోన్స్‌-ఛార్లీ డీన్‌ రికార్డు భాగస్వామ్యం

Apr 1,2024 22:26 #Cricket, #england womens, #Sports
  • తొలి వన్డేలో న్యూజిలాండ్‌ మహిళలపై ఇంగ్లండ్‌ మహిళల గెలుపు

హామిల్టన్‌: ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు అమీ జోన్స్‌-ఛార్లీ డీన్స్‌ వన్డేల్లో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్‌ మహిళలతో జరుగుతున్న వన్డేలో 7వ వికెట్‌కు వీరిద్దరూ 130పరుగులు జోడించారు. అమీ జనోన్స్‌(93నాటౌట్‌), డీన్‌(42నాటౌట్‌) పరుగులతో క్రీజ్‌లో నిలిచి ఇంగ్లండ్‌ను గెలిపించారు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 208పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు 79పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వీరిద్దరూ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి 41.2ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. దీంతో 2022 మహిళల ప్రపంచకప్‌లో స్నేV్‌ా రాణా-పూజా వస్త్రాకర్‌ నెలకొల్పిన 122 పరుగుల రికార్డు స్కోర్‌ను వీరు బ్రేక్‌ చేశారు. అంతకుముందు తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు 48.2ఓవర్లలో 207పరుగులకు ఆలౌటైంది.

➡️