దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ పునరాలోచించాలి : శార్ధూల్‌

Mar 4,2024 12:59 #Cricket, #Ranji Trophy, #Sports

భారత బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల వ్యవధితో 10 మ్యాచులు ఆడడం ఏ ఆటగాడికైనా ఇబ్బందిగానే ఉంటుందన్నారు. ఇలా విరామం లేకుండా క్రికెట్‌ ఆడితే శరీరం సహకరించడం కష్టమని పేర్కొన్నాడు. అలాగే ఆటగాళ్లు వరుసపెట్టి రోజుల వ్యవధిలో క్రికెట్‌ ఆడితే గాయాల బారిన పడతారని అన్నాడు. వచ్చే ఏడాది నుంచి ఈ విషయంలో బీసీసీఐ ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఏడెనిమిదేళ్ల క్రితం ఇలా షెడ్యూల్‌ ఉండేది కాదని, మొదటి మూడు మ్యాచులకు మూడు రోజుల గ్యాప్‌ ఉంటే.. ఆ తర్వాత నాలుగో మ్యాచ్‌కు నాలుగు రోజుల వ్యవధి ఉండేదన్నాడు. ఇక నాకౌట్‌ మ్యాచులకైతే ఐదేసి రోజుల వ్యవధి ఉండేదని చెప్పుకొచ్చాడు.కాగా తమిళనాడుతో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో శార్దూల్‌ కేవలం 89 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మొత్తంగా 105 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఈ తుపాన్‌ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండడం విశేషం.

➡️