ఆస్ట్రేలియాను కట్టడి చేసిన మహిళా బౌలర్లు
ఆస్ట్రేలియా 219ఆలౌట్..భారత్ 98/1
ముంబయి: ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలు సత్తా చాటారు. వాంఖడే వేదికగా గురువారం నుంచి ప్రారంభమైన టెస్ట్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను కేవలం 219పరుగులకే టీమిండియా బౌలర్లు ఆలౌట్ చేశారు. బౌలింగ్‌లో పూజ వస్త్రాకర్(4/53), స్నేహ్ రాణా(3/56), దీప్తి శర్మ(2/45) రాణించి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ఇంగ్లండ్‌ను 347 పరుగులతో చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆస్ట్రేలియాపైనే రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆది నుంచి తడబడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(0) రనౌటయ్యింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్ ఎలిసా పెర్రీ(4)ని పూజా వస్త్రాకర్ వెనక్కి పంపింది. బేత్ మూనీని(40 ), సథర్లాండ్(16) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలను ఒత్తిడిలోకి నెట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ నష్టపోయి 98 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(40) ఔట్ కాగా.. స్మఅతి మంధానా(43), స్నేహ్ రాణా(4) క్రీజ్‌లో ఉన్నారు. మంధాన-షెఫాలీ కలిసి తొలి వికెట్‌కు 90పరుగులు జతచేశారు. భారతజట్టు ఇంకా 121పరుగులు వెనుకబడి ఉంది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా మహిళల తొలి ఇన్నింగ్స్: మూనీ (సి)స్నేహ్ రాణా (బి)పూజ వస్త్రాకర్ 40, లిచ్‌ఫీల్డ్ (రనౌట్) రోడ్రిగ్స్/యాస్టికా భాటియా 0, ఎలీసా ఫెర్రీ (బి)పూజ వస్త్రాకర్ 4, మెక్‌గ్రాత్ (సి)గైక్వాడ్ (బి)స్నేహ్ రాణా 50, హీలీ (బి)దీప్తి 38, సథర్లాండ్ (ఎల్బి)పూజ వస్త్రాకర్ 16, గార్డినర్ (సి)యాస్తికా భాటియా (సి)యాస్టికా భాటియా (బి)పూజ వస్త్రాకర్ 11, జాన్సన్ (ఎల్బి)దీప్తి 19, కింగ్ (సి)యాస్టికా భాటియా (బి)స్నేV్‌ా రాణా 5, కిమ్ గ్రాత్ (నాటౌట్) 28, లారెన్ ఛెట్లీ (సి)మంధాన (బి)స్నేహ్ రాణా 6, అదనం 2. (77.4ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1/2, 2/7, 3/87, 4/103, 5/143, 6/159, 7/160, 8/168, 9/198, 10/219
బౌలింగ్: రేణుక సింగ్ 7-0-35-0, పూజ వస్త్రాకర్ 16-2-53-4, స్నేహ్ రాణా 22.4-4-56-3, గైక్వాడ్ 13-4-29-0, దీప్తి శర్మ 19-3-45-2. ఇండియా మహిళల ఇన్నింగ్స్: షెఫాలీ వర్మ (ఎల్బి)జాన్సన్ 40, స్మృతి మంధాన (బ్యాటింగ్) 43, స్నేV్‌ా రాణా (బ్యాటింగ్) 4, అదనం 11. (19 ఓవర్లలో వికెట్ నష్టానికి) 98పరుగులు.
వికెట్ల పతనం: 1/90 బౌలింగ్: లారెన్ 4-2-12-0, గ్రాత్ 4-0-34-0, ఎలీసా ఫెర్రీ 4-0-31-0, గార్డినర్ 5-3-8-0, జాన్సన్ 2-1-4-1