దీప్తికి 2వ ర్యాంక్‌.. ఐసిసి మహిళల టి20 ర్యాంకింగ్స్‌

Jan 30,2024 22:05 #Sports

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా టి20 మహిళల బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్‌ దీప్తి శర్మ 2వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐసిసి మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ 718రేటింగ్‌ పాయింట్లతో 2వ స్థానంలో నిలువగా.. రేణుకా సింగ్‌ టాప్‌-10లో చోటు దక్కించుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ నోకులులెకో ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరచడంతో దీప్తి ర్యాంక్‌ మెరుగైంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన సైదా ఇక్బాల్‌తో కలిసి సంయుక్తంగా దీప్తి 2వ స్థానంలో నిలిచింది. టాప్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ ఎక్లేస్టోన్‌(777పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ దీప్తి 4వ స్థానంలో నిలిచింది. బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన 713రేటింగ్‌ పాయింట్లతో 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 13, 16, 17వ ర్యాంకుల్లో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన బెత్‌ మూనీ(766పాయింట్లు), మెక్‌ గ్రాత్‌(762పాయింట్లు) టి20 బ్యాటర్స్‌ జాబితాలో టాప్‌లో ఉన్నారు. బెత్‌ మూనీ 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో రాణించడంతో టాప్‌ ర్యాంక్‌కు ఎగబాకింది.

➡️