16 సిక్స్‌లతో ఫిన్‌ అలెన్‌ పరుగుల సునామీ..

Jan 17,2024 12:28 #Cricket, #Newzland, #Sports

డునెడిన్‌ : డునెడిన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న 3వ టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.. 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) పరుగులు చేవారు. అలెన్‌ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్‌. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123) పేరిట ఉండింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. అలెన్‌ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మ్యాచ్‌లో అలెన్‌ విధ్వంసం ధాటికి పాక్‌ బౌలర్లు షాహీన్‌ అఫ్రిది (4-0-43-1), హరీస్‌ రౌఫ్‌ (4-0-60-2), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-44-1), మొహమ్మద్‌ వసీం జూనియర్‌ (4-0-35-1), జమాన్‌ ఖాన్‌ (4-0-37-1) పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ 20 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి, ఓటమి పాలైంది. పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ (24), సయీమ్‌ అయూబ్‌ (10), బాబర్‌ ఆజం (58), ఫఖర్‌ జమాన్‌ (19), ఇఫ్తీకర్‌ అహ్మద్‌ (1), ఆజం ఖాన్‌ (10), మహ్మద్‌ నవాజ్‌ (28), షాహీన్‌ అఫ్రిది (16), మహ్మద్‌ వసీం జూనియర్‌(1) పరుగులు మాత్రమే చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ 2, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, మిచెల్‌ సాంట్నర్‌ (సి), ఇష్‌ సోధి తలో వికెట్‌ తీసుకున్నారు.

➡️