IND vs ENG :  ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌ ఆధిక్యం 322

Feb 17,2024 17:27

మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(65), కుల్దీప్‌ యాదవ్‌(3) పరుగులతో ఉన్నారు. అదే విధంగా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్‌ కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రూట్‌, హార్ట్లీ తలో వికెట్‌ తీశారు. కాగా అంతకముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది.

  • రజత్‌ పటిదార్‌ డకౌట్‌

రజత్‌ పటీదార్‌ డకౌటయ్యాడు. 47.4 వద్ద హార్ట్‌ వేసిన బంతికి సులభమైన క్యాచ్‌ ఇచ్చి మిడ్‌ వికెట్‌ లో ఉన్న రెహాన్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌ స్కోరు 191/2 (48 ఓవర్లు)

శుబ్‌మన్‌ గిల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ స్కోర్‌: 184/1. భారత్‌ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • జైశ్వాల్‌ సెంచరీ.. 292 పరుగుల అధిక్యంలో టీమిండియా

మూడో టెస్ట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌ సెంచరీ సాధించాడు. 129 బంతుల్లో 9 ఫోరు్ల 5 సిక్సర్ల సాయంతో జైశ్వాల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు గిల్ 40 పరుగులతో అర్థశతకానికి దగ్గర్లో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 292 పరుగుల అధిక్యంలో ఉంది.

  • జైశ్వాల్‌ 50.. 233 పరుగుల అధిక్యంలో టీమిండియా

మూడో టెస్ట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 80 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 2 సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరి పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శుభ్‌మాన్‌ గిల్‌ 59 బంతుల్లో 29 పరుగులపై బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 233 పరుగుల అధిక్యంలో ఉంది.

22 ఓవర్లకు 63 పరుగులు

22 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట్‌ 63 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌ 64 బంతుల్లో 29, శుభ్‌మాన్‌ గిల్‌ 41 బంతుల్లో 14 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 189 పరుగుల అధిక్యంలో ఉంది.

 

  • తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

28 బంతుల్లో 19 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ జో రూట్‌ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. గిల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్‌ 10 పరుగులతో ఆడుతున్నాడు.

  • ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. 126 పరుగుల లీడ్‌లో టీమిండియా

సిరాజ్‌ బౌలింగ్‌ ఆండర్సన్‌ బౌల్డ్‌ ఔటాయ్యడు. పదో వికెట్‌గా ఆండర్సన్‌ వెనుదిరగడంతో… ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్‌ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది.  ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 4, జడేజా 2, కుల్‌దీప్‌ 2, ఆశ్విన్‌,బుమ్రా తలో వికెట్‌ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 153 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా ఒల్లీ పోప్ 39, కెప్టెన్ బెన్ స్టోక్స్ 41 , జాక్ క్రాలీ 15, రూట్ 18, బెయిర్‌స్టో 0 , ఫోక్స్ 13, రెహాన్ అహ్మద్ 6 , టామ్ హార్ట్లీ 9 , మార్క్ వుడ్ 4 , జేమ్స్ ఆండర్సన్ 1 పరుగులు చేశారు. 

  • టామ్‌ హర్టీ స్టంప్‌ఔట్‌

జడేజా బౌలింగ్‌లో టామ్‌ హర్టీ స్టంప్‌ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి అండరన్స్‌ వచ్చాడు. ఇంగ్లాండ్‌ 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.

  • రెహన్‌ అహ్మద్‌ ఔట్‌

13 బంతుల్లో 6 పరుగులు చేసిన రెహన్‌ ఆహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. క్రీజులోకి మార్క్‌వుడ్‌ వచ్చాడు. ఇంగ్లాండ్‌ 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.

  • బెన్‌ ఫోక్స్‌ క్యాచ్‌ ఔట్‌

లంచ్‌ బ్రేక్‌ తరువాత ఇంగ్లాండ్‌ వరస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుతు బెన్‌ స్టోర్స్‌ ఔట్‌ అవ్వగా.. తరువాత సిరాజ్‌ బౌలింగ్‌లో బెన్‌ ఫోక్స్‌ బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. బెన్‌ ఫోక్స్‌ 37 బంతుల్లో 13 పరుగులు చేశాడు. క్రీజులోకి టామ్‌ హర్టీ వాచ్చాడు.

  • బెన్‌స్టోక్స్‌ ఔట్‌

89 బంతుల్లో 41 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్‌ జడేజా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి రిహాన్‌ అహ్మద్‌ వచ్చాడు. బెన్‌ ఫోక్స్‌ 37 బంతుల్లో 13 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ ప్రస్తుతం 299 పరుగులు చేసింది.

  • బెన్‌డకెట్‌ ఔట్‌

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. బెన్‌ డకెట్‌ అవుటయ్యాడు. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేశాడు.

  • బెయిర్‌ స్టో డకౌట్‌

కుల్‌దీప్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 40.4 వేసిన బంతికి జానీ బెయిర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.క్రీజ్‌లోకి కి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు.

 

  • మూడో వికెట్‌.. జో రూట్‌ ఔట్‌

తొలి సెషన్‌ ప్రారంభంలోనే భారత్‌కు వికెట్‌ దక్కింది. బుమ్రా వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలో జో రూట్‌ (18) సెకండ్‌ స్లిప్లో ఉన్న జైస్వాలుకు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి బెయిర్‌స్టో వచ్చాడు. ఇంగ్లాండ్‌ స్కోరు 224/3 (40 ఓవర్లు)

  • రాజ్కోట్‌ టెస్టు.. ప్రారంభమైన మూడో రోజు ఆట

మూడో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు (35 ఓవర్లు) చేసింది. క్రీజ్లోకి డకెట్‌ (133), రూట్‌ (9) వచ్చారు. ఇంగ్లాండ్‌ 238 పరుగులు వెనుకంజలో ఉంది. వ్యక్తిగత కారణాలతో అశ్విన్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకోగా అతని స్థానంలో దేవత్‌ పడిక్కల్‌ ఫీల్డింగ్‌ కు వచ్చాడు. భారత మాజీ కెప్టెన్‌ దత్తాజి రావు గైక్వాడ్‌ మతికి నివాళిగా భారత ఆటగాళ్లు ఈ రోజు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని మైదానంలో దిగారు.

➡️