IND vs ENG Day 3 : మూడో రోజు ముగిసిన ఆట.. గెలుపు దిశగా టీమిండియా

Feb 25,2024 16:46 #Cricket, #IND VS ENG, #India, #Sports, #test

రాంచీ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి. కాగా ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ 5, కుల్దీప్‌ 4 వికెట్లతో ఇంగ్లండ్‌ పనిబట్టారు. జడేజాకు 1 వికెట్‌ దక్కింది. అనంతరం, 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 24, యశస్వి జైస్వాల్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 145 పరుగులకే ఇంగ్లండ్‌ అలౌట్‌.. టీమిండియా లక్ష్యం 192

ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అశ్విన్‌ ఐదు, కుల్దీప్‌ నాలుగు వికెట్లతో రాణించగా.. జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60), బెయిర్‌స్టో (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశారు. మిగతా బ్యాటర్లు బెన్‌ స్టోక్స్‌ (4), జో రూట్‌ (11), టామ్‌ హార్ట్లీ (7), బెన్‌ డకెట్‌(15), పోప్‌(0), ఓలీ రాబిన్సన్‌ (0) విఫలమ్యారు. టీమిండియా లక్ష్యం 192 పరుగులుగా ఇంగ్లాండ్‌ నిర్దేశించింది.

  • ఓలీ రాబిన్సన్‌ డక్‌ఔట్‌

కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్‌ (0) ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. 133 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మరో (ఎనిమిది) వికెట్‌ కోల్పోయింది. బెన్‌ ఫోక్స్‌కు జతగా షోయబ్‌ బషీర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

  • ఏడో వికెట్‌ డౌన్‌

133 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో టామ్‌ హార్ట్లీ (7) సర్ఫరాజ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

  • బెయిర్‌స్టో ఔట్‌

120 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో (30) ఔటయ్యాడు. టామ్‌ హార్ట్లీ, బెన్‌ ఫోక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

  • బెన్‌ స్టోక్స్‌ క్లీన్‌ బౌల్డ్‌

120 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (4) క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి బెన్‌ ఫోక్స్‌ వచ్చాడు. జానీ బెయిర్‌స్టోకు (30) పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • నాలుగో వికెట్‌ డౌన్‌

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలే.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు. 29 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 112/4.

  • జో రూట్‌ ఔట్‌..ఇంగ్లండ్‌ 66/3

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిని జో రూట్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 66/3

  • ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. ఇంగ్లండ్‌ 19/2

రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌​కు ఆదిలోనే  బిగ్‌ షాక్‌ తగిలింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్‌ వేసిన అశ్విన్‌.. వరుస బంతుల్లో బెన్‌ డకెట్‌(15), పోప్‌(0) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 19/2. క్రీజులో జాక్‌ క్రాలే, జో రూట్‌ ఉన్నారు.

  • భారత్‌ 307 ఆలౌట్‌.. 46 పరుగుల అధిక్యంలో ఇంగ్లాండ్‌

రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. దృవ్‌ జురల్‌ తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్‌ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్‌(73), కుల్దీప్‌ యాదవ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్‌ హార్ట్‌లీ 3 వికెట్లు, జేమ్స్‌ ఆండర్సన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

  • తొమ్మిదో వికెట్‌ డౌన్‌..

టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఆకాష్‌ దీప్‌.. బషీర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. బషీర్‌ ఆకాష్‌ వికెట్‌తో తన తొలి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 102 ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్‌: 303/9

  • దృవ్‌ జురల్‌ 50

భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దృవ్‌ జురల్‌ నాల్గో టెస్టులో హఫ్‌ సెంచరీ సాధించాడు. 96 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్‌ 90 ఓవర్లకు 254 పరుగులు చేసింది.

  • కుల్‌దీప్‌ ఔట్‌

అండర్సన్‌ బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ ఔటయ్యాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ 137 బంతుల్లో 28 పరుగులు చేశాడు. క్రీజులోకి ఆకాశ్‌ దీప్‌ వచ్చాడు. ప్రస్తుతం భారత్‌ 89 ఓవర్లకు 253 పరుగులు చేసింది. దృవ్‌ జురల్‌ 49 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • నిలకడగా ఆడుతున్న దృవ్‌ జురల్‌, కుల్దీప్‌..

భారత్‌ స్కోర్‌: 240/782 ఓవర్లు ముగిసే సరికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రీజులో దృవ్‌ జురల్‌(39), కుల్దీప్‌ యాదవ్‌(25) పరుగులతో ఉన్నారు.

  • మూడో రోజు ఆట ప్రారంభం

రాంచీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. కుల్‌దీప్‌, దృవ్‌ జురెల్‌ క్రీజులోకి వచ్చారు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను షోయబ్‌ బషీర్‌ ప్రారంభించాడు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో దృవ్‌ జురల్‌(30), కుల్దీప్‌ యాదవ్‌(17) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనకబడి ఉంది.

➡️