పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమి.. సెంచరీతో రాణించిన పాక్‌ బ్యాటర్‌

Dec 10,2023 22:25 #Sports

దుబాయ్ :దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ లో ఆజాన్‌ అవైస్‌ సెంచరీ (105)తో నాటౌట్‌ గా నిలిచాడు. ఆ తర్వాత సాద్‌ బేగ్‌ (68) పరుగులతో రాణించి నాటౌట్‌ గా ఉన్నాడు. మరో బ్యాటర్‌ షాజీబ్‌ ఖాన్‌ (63) పరుగులు చేయడంతో పాకిస్థాన్‌ విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టులో మురుగన్‌ అభిషేక్‌ ఒక్కడే 2 వికెట్లు సంపాదించాడు. మిగతా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.అంతకుముందు బ్యాటింగ్‌ కు దిగిన భారత కుర్రాళ్ల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (62), కెప్టెన్‌ ఉదయ్ సహారన్‌ (60), సచిన్‌ దాస్‌ (58) అర్ధసెంచరీలతో రాణించారు. పాకిస్థాన్‌ బౌలర్లలో మహ్మద్‌ జీషాన్‌ 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత.. అమీర్‌ హసన్‌ 2, ఉబైద్‌ షా 2, అరాఫత్‌ మిన్హాస్‌ 1 వికెట్‌ తీశారు.

➡️