కిదాంబి సంచలనం

Jan 10,2024 22:12 #Sports
  • తొలిరౌండ్‌లో 5వ ర్యాంకర్‌ క్రిస్టీపై గెలుపు
  • రెండో రౌండ్‌కు సాత్విక్‌-చిరాగ్‌ జోడి
  • మలేషియా ఓపెన్‌ సూపర్‌1000

కౌలాలంపూర్‌: మలేషియా ఓపెన్‌ సూపర్‌1000లో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌, మాజీ నంబర్‌వన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ పెను సంచలనాన్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 12-21, 21-18, 21-16తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జనాథన్‌ క్రిస్టీ(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్‌లో లాంగ్‌-అంగుస్‌(హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌ తలపడనున్నాడు. డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌లో 2వ ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ాచిరాగ్‌ జోడీ శుభారంభం చేశారు. తొలిరౌండ్‌ పోటీలో సాత్విక్‌-చిరాగ్‌ 21-18, 21-19తో మహ్మద్‌ షోహిబుల్‌, మౌలానా బగస్‌(మలేషియా)పై పోరాడి నెగ్గారు. ఈ మ్యాచ్‌ను భారత జోడీ కేవలం 44 నిమిషాల్లోనే ముగించింది. 2వ రౌండ్‌లో చైనా, థారులాండ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనున్నారు. ఇక మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా(భారత్‌) జోడీ 21-13, 21-16తో ఫ్రాన్సెస్కా కోర్బి-అలీసన్‌ లీ(అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రపంచ 8వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ 14-21, 11-21 తేడాతో డెన్మార్క్‌ ప్లేయర్‌ అండర్‌ అంటోన్సెన్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

➡️