సెపక్‌ తక్ర విజేతగా పంజాబ్‌ యూనివర్సిటీ పాటియాలా

ప్రజాశక్తి-ఆదోని కర్నూలు జిల్లా : ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నిర్వహించిన ఆల్‌ ఇండియా అంతర్‌ విశ్వవిద్యాలయాల సెపక్‌ తక్ర పోటీల్లో విజేతగా పంజాబ్‌ యూనివర్సిటీ పాటియాలా నిలిచింది. అంతకుముందు నాలుగు రోజులుగా జరుగుతున్న పోటీలను ముఖ్య అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌టికె నాయక్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అంకన్న క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించారు. క్వాడ్రెంట్‌ ఈవెంట్‌లో రెండవ స్థానం యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌, మూడవ స్థానం అన్నా యూనివర్సిటీ చెన్నై, మణిపూర్‌ విశ్వ విద్యాలయాలు నిలిచాయి. కర్నూలు సెయిట్‌ జోసెఫ్‌ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ శౌరిల్‌రెడ్డి, డాక్టర్‌ జ్యోతిర్మయి కళాశాల కరస్పాండెంట్‌ మురళిబాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ విట్టా సతీష్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ లక్ష్మి, కరస్పాండెంట్‌ దైవాదినం రెడ్డి, ప్రిన్సిపల్‌ మురళీమోహన్‌, మాజీ కరస్పాండెంట్‌ విశ్వనాథ రెడ్డి, రాయలసీమ విశ్వవిద్యాలయం ఫిజికల్‌ డైరెక్టర్లు శివకిషోర్‌, మత్తయ్య, కళ్యాణ్‌ కుమార్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️