సవితకే మళ్లీ పగ్గాలు

Dec 8,2023 21:26 #Hockey, #India
savitha as captain india hockey

స్పెయిన్‌లో 15నుంచి ఐదు దేశాల హాకీ టోర్నీ

బెంగళూరు: స్పెయిన్‌ వేదికగా 15నుంచి జరగనున్న ఐదు దేశాల టోర్నమెంట్‌లో పాల్గనే భారత మహిళల జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. గోల్‌ కీపర్‌ సవిత పునియకు మరో దఫా కెప్టెన్‌గా ఎంపికయ్యింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గనే 22మంది ఆటగాళ్ల జాబితాను హెచ్‌ఐ శుక్రవారం వెల్లడించింది. ‘బలమైన జట్టుతో ఐదు దేశాల టోర్నీలో పాల్గనేందుకు వెళ్తున్నామని, మిగిలిన నాలుగుజట్లు బలమైన జట్లు కావడంతో ఆ టోర్నమెంట్‌లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళల హాకీ చీఫ్‌ కోచ్‌ జన్నెకే షాప్‌మాన్‌ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ ప్రదర్శన ఆధారంగా భారత్‌లో జరిగే క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో ఆటగాళ్లను ఎంపిక చేయడం జరుగుతుందని, యూరోపియన్‌ టాప్‌క్లాస్‌ జట్లతో తలపడే భారతజట్టు ప్రదర్శనను ఎంతో దోహదపడుతుందని ఆమె తెలిపారు. టోర్నీలో భారత్‌తోపాటు ఆతిథ్య స్పెయిన్‌, ఐర్లాండ్‌, జర్మనీ, బెల్జియం జట్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ టోర్నమెంట్‌ స్పెయిన్‌లోని వెలెన్సియా వేదికగా డిసెంబర్‌ 15-22మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్‌ ముగిసిన అనంతరం రాంచీ వేదికగా జనవరి 13నుంచి ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

జట్టు..

గోల్‌కీపర్లు : సవిత(కెప్టెన్‌), బిఛ్ఛూ దేవి ఖరిబమ్‌
డిఫెండర్లు: నిక్కి ప్రధాన్‌, ఉదిత, ఇషికా చౌదరి, గుర్జీత్‌ కౌర్‌, అక్షత అబోసోమిడ్‌ఫీల్డర్లు: నిషా, వైష్ణవి, మోనిక, సలీమా తెతె, నేహా, నవ్‌నీత్‌ కౌర్‌, సోనిక, బల్జీత్‌ కౌర్‌ఫార్వర్డ్స్‌: జ్యోతి ఛత్రి, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా(వైస్‌ కెప్టెన్‌), బ్యూటీ దుంగ్‌దంగ్‌, షర్మిలా దేవి

➡️