రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

Dec 21,2023 17:29 #Cricket, #India, #South Africa, #Sports

పార్ల్‌లోని బోలాండ్‌ పార్క్‌ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌ (22) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 10 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ హెండ్రిక్స్‌ బౌలింగ్‌లో ఎల్‌బీగా పెవిలియన్‌కు చేవారు. క్రీజులో సంజూ శాంసన్‌ 21 బంతుల్లో 11, కెఎల్‌ రాహుల్‌ 7 బంతుల్లో 7 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్‌

పార్ల్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్‌ ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బరిలోకి దిగనున్నారు.

తుది జట్లు:

భారత్‌: సాయి సుదర్శన్‌, రజత్‌ పాటిదార్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుం?దర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌, ముఖేష్‌ కుమార్‌

దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్‌, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ మిల్లర్‌, వియాన్‌ ముల్డర్‌, కేశవ్‌ మహరాజ్‌, నండ్రే బర్గర్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

➡️