టీ20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న వేళ ప్రముఖ స్పోర్ట్స్వేర్ బ్రాండ్, కిట్ స్పాన్సర్ అడిడాస్ జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. హెలికాప్టర్ సాయంతో జెర్సీని ప్రదర్శిస్తుంటే.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మైదానం నుంచి ఆసక్తికరంగా వీక్షిస్తున్నట్లు వీడియోను రూపొందించింది. టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది. బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్