పిల్లల వేసవి ప్రత్యేక సంచిక – బాలల రచనలకు ఆహ్వానం!

May 19,2024 08:44 #Children, #Sneha

ప్రియమైన చిన్నారులూ,
వేసవి సెలవులు సందర్భంగా ‘ప్రజాశక్తి’ స్నేహ అనుబంధాన్ని మీ కోసం
ఒక ప్రత్యేక సంచికగా తేవాలని నిర్ణయించాం. పిల్లల సంతోషమే మా సంతోషం.
ఇందులో మీరు రాసే రచనలకు, గీసే బొమ్మలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రచురిస్తాం. కథలు, కవితలు, బొమ్మలు, పుస్తక సమీక్షలు.. ఇలా అన్ని రచనా ప్రక్రియల్లోనూ
మీ సృజనకు ఈ సంచికలో చోటుంటుంది.
సామాజిక అంశం ఏదయినా తీసుకోండి. కథగానో, కవితగానో అల్లేయండి.
కనువిందు చేసే బొమ్మలూ గీసేయండి! వేసవిలో మీరు సందర్శించిన ప్రదేశాల గురించి, మీరు చదివిన పుస్తకంపై సమీక్ష రాయండి!!
రచనలు క్లుప్తంగా ఉండాలని మర్చిపోకండి.
మూఢ నమ్మకాలు, దైవభక్తి వంటివి ప్రచురణకు అనర్హం.
ఇంకా పెద్ద పెద్ద రచయితలు/ రచయిత్రులు కూడా చక్కని కథలు రాస్తారు.
గొప్ప గొప్ప చిత్రకారులు బొమ్మలు గీస్తారు. అవన్నీ మీ కోసమే!

జూన్‌ 16వ తేదీన వచ్చే ఈ సంచిక మీకొక గొప్ప కానుకే కాదు;
చక్కని జ్ఞాపకం కూడా అవుతుంది.
మీరంతా పదిలంగా దాచుకునేలా ఈ బాలల ప్రత్యేక సంచికను రూపొందిద్దాం.
దీనికి మీ సహాయం కావాలి. మీ భాగస్వామ్యం కావాలి.
ఎందుకంటే- ఈ సంచిక మీదే!
దీని రూపకర్తలూ మీరే!
మరి ఇంకెందుకు, ఆలస్యం?
పెన్ను తీసుకోండి. పెన్సిలు అందుకోండి.
కమ్మని కథలు రాయండి. చక్కని కవితలు అల్లండి.
అందమైన బొమ్మలు గీయండి. మీ రచనతో పాటు మీ పేరు, ఊరు, తరగతి,
తదితర వివరాలు రాయడం మర్చిపోకండి.
బాగున్నారు అని మీరు అనుకున్నాక- ఈ దిగువ ఇచ్చిన మెయిల్‌ ఐడికీ పంపేయండి.
ఇంకా ఏమన్నా అడగాలంటే..
8333818985 నెంబరుకు కాల్‌ చేయండి.
– సంపాదకులు

మీ రచనలు పంపాల్సిన మెయిల్‌ ఐడి :

childrenspecial2024@gmail.com

రచనలు, బొమ్మలూ చేరాల్సిన చివరి తేదీ
మే 26, 2024.

➡️