ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..

Mar 4,2024 16:40 #Awards, #Cricket, #icc, #Sports

2024 ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ వెల్లడించింది. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ యశస్వి జైస్వాల్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది.

మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ ఫిబ్రవరి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. కాగా విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. ఓటింగ్‌ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.

➡️