మళ్లీ కౌంటీల్లో ఆడనున్న ఉనాద్కట్‌

Mar 19,2024 21:59 #Cricket, #Sports

లండన్‌: గత సీజన్‌లో కౌంటీల్లో ఆడిన 32ఏళ్ల జయదేవ్‌ ఉనాద్కట్‌ ఈ ఏడాది మరోదఫా కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గత ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్‌ తరఫున ఆడిన ఉనాద్కట్‌.. డివిజన్‌-2 మ్యాచుల్లో 24.18 యావరేట్‌తో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. అతడు ప్రాతినిధ్యం వహించిన క్లబ్‌ ఆ ఏడాది మూడోస్థానంలో నిలిచింది. 2023 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు చివరిసారిగా ప్రతినిధ్యం వహించిన ఉనాద్కట్‌ ఈ ఏడాది సస్సెక్స్‌ క్లబ్‌ తరఫున మళ్లీ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సస్సెక్స్‌ క్లబ్‌ ప్రధాన కోచ్‌ పార్బ్రేస్‌ మాట్లాడుతూ.. ఉనాద్కట్‌ గత సీజన్‌లో అద్భుత బౌలింగ్‌తో అలరించాడని, దీంతో అతడ్ని ఈ సీజన్‌లోనూ తమ క్లబ్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం చేసుకొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకఉనాద్కట్‌ ప్రాతినిధ్యం వహించిన సౌరాష్ట్ర జట్టు 2019-20 సీజన్‌లో తొలిసారి రంజీట్రోఫీ టైటిల్‌ను చేజిక్కించుకొంది.

➡️