మహిళల టి20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ విడుదల

May 6,2024 08:08 #Cricket, #Sports, #T20 world cup, #women's

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) మహిళల టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగే ఈ టోర్నీలో మొత్తం 10జట్లు తలపడనున్నాయి. 10జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్‌ దశలో ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి టాప్‌-2 నిలిచిన జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. అక్టోబర్‌ 4న భారత మహిళల జట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో తలపడనుంది. అక్టోబర్‌ 6న పాకిస్థాన్‌తో భారత్‌ ఢకొీంటుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది.
గ్రూప్‌ ఎ:
భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌,
ఆస్ట్రేలియా (క్వాలిఫయర్‌ 1)

గ్రూప్‌ బి:
ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌,
దక్షిణాఫ్రికా (క్వాలిఫయర్‌ 2)

భారత మహిళల షెడ్యూల్‌..
అక్టోబర్‌ 4: భారత్‌ × న్యూజిలాండ్‌, సిల్హెట్‌
అక్టోబర్‌ 6: భారత్‌ × పాకిస్థాన్‌, సిల్హెట్‌
అక్టోబర్‌ 9 : భారత్‌ × క్వాలిఫైయర్‌ 1, సిల్హెట్‌
అక్టోబర్‌ 13: భారత్‌ × ఆస్ట్రేలియా, సిల్హెట్‌
అక్టోబర్‌ 17 : తొలి సెమీఫైనల్‌, సిల్హెట్‌
అక్టోబర్‌ 18 : రెండో సెమీఫైనల్‌, ఢాకా
అక్టోబర్‌ 20 : ఫైనల్‌, ఢాకా

➡️