అంకితభావంతో పనిచేయాలి

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం

అధికారులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక, జెసి ఎం.నవీన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ తమీమా అన్సారియాలతో కలిసి జిల్లా అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల విధులు ఉంటాయన్నారు. ప్రస్తుతం శాఖా పరమైన పనులు ఉంటాయన్నారు. అందరూ చురుగ్గా ఉంటూ పనిచేయాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు. శాఖాపరమైన విధులతో పాటు రానున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సంసిద్ధతతో ఉండాలన్నారు. సిబ్బందిని అప్రమత్తతో పనిచేయించాలని, అంతా కలసి ఒక టీంగా పని చేయాలని పేర్కొన్నారు. జెసి నవీన్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిషాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్‌పి సిఇఒ వెంకటరామన్‌, డిపిఒ రవికుమార్‌, ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ, డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌, డ్వామా పీడీ చిట్టిరాజు, డిటిసి చంద్రశేఖర్‌రెడ్డి, ఎపిసి జయప్రకాష్‌, మైన్స్‌ డిడి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.మీనాక్షి, సిపిఒ లక్ష్మీప్రసన్న, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇఒ హరిసూర్య ప్రకాష్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌, జిల్లా చేనేత శాఖ అధికారి ధర్మారావు పాల్గొన్నారు.

 

➡️