ఈ ‘పాట్లు’ ఇంకెన్నాళ్లు..?

Dec 20,2023 20:56

మక్కువ : మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పూర్తి అద్వాన్నంగా తయారవడంతో వాహన చోదకులకు పాట్లు తప్పడం లేదు. రహదారిపై పడుతూ లేస్తూ వెళ్లడం పరిపాటిగా వస్తుందని పలువురు వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం మక్కువ గ్రామానికి చెందిన ఓ వృద్ధ పాస్టర్‌ వాహనంతో రహదారి గోతిలో పడిపోవడంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మండలంలోని వాహన చోదుకులు ఇంకెన్నాళ్లీ పాట్లు పడాల్సి వస్తుందో తెలియడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరి నెలలో సంబర పోలమాంబ అమ్మవారి జాతర ప్రారంభం కావడం, సంక్రాంతి పండుగ కూడా రావడంతో మరింత రద్దీ పెరిగే ఆస్కారం ఉందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

➡️