ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్క రించాలని, ఉద్యోగులకు ఐఆర్‌ 30శాతం ఇవ్వాలని ఎపి జెఎసి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌, ఎపి ఎన్‌జిఒ ప్రధాన కార్యదర్శి కె .వి.శివారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగ ళవారం కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఎపి జెఎసి ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. అంతకు ముందు నల ్లబ్యాడ్డీలతో మహావీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి, చైర్మన్‌ బి. శ్రీని వాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షలు వై. ప్రసాద్‌ యాదవ్‌ ,రాష్ట్ర సెక్రటరీ కష్ణా రెడ్డి, యుటి ఎఫ్‌˜్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జెఎసి కన్వీనర్‌ డి. రవికుమార్‌ మాట్లాడారు. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెం టనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 12వ పిఆర్‌సి అమలు చేయాలన్నారు. జిపిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ డిఎ, పిఆర్‌సి, అరి యర్స్‌ వెంటనే చెల్లించాలన్నారు. ఒపి ఎస్‌ను అమలు చేయాలన్నారు. పెన్ష నర్లకు అడిషనల్‌ క్వాంటాం పెంచా లన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అందరిని వెంటనే రెగ్యులర్‌ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయల సమస్యలను పరిష్క రించాలని చెప్పారు. 11వ పిఆర్‌సి ఆర్‌ఎస్‌ వెంటనే చెల్లించాలని కోరారు. ఎఇహెచ్‌ఎస్‌ ద్వారా అన్ని నెట్‌ వర్క్‌ హాస్పిటల్‌ల్లో నగదు రహిత వైద్యం అందిం చాలని చెప్పారు. ఐఆర్‌ 30 శాతం ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. ఈనెల 27న నిర్వహించే చలో విజయవాడలో ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని కోరా రు. ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగులకు పెండింగ్‌ డిమాండ్స్‌ పరిష్క రించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్రైవర్‌ అసో సియేషన్‌ అధ్యక్షులు కొండయ్య, జెఎసి నాయకులు తిమ్మారెడ్డి, నిత్య పూజయ్య, బాలపులయ్య, వాసన్‌, నరసింరెడ్డి, నిర్మల జ్యోతి, గౌరీ, జ్యోతి, వెంకట్‌ రెడ్డి, కె చిన్నయ్య, సైలేశ్వర్‌ రెడ్డి, పద్మనాభం, కాటమయ్య, రాజగోపాల్‌ రెడ్డి నాయకులు శ్రీనివాసులు, నాగార్జున, బాలయ్య, భూషణం, అన్ని తాలూకా అధ్యక్షులు కార్యదర్శలు, కార్య వర్గ సభ్యులు,పెన్షనర్ల అసోసియేషన్‌ రాధ కష్ణ, కష్ణ కుమారి, అరుణమ్మ, జానకి, బాదుల్లా పాల్గొన్నారు.

➡️