ఎస్మాకు భయపడేదేలే..

Jan 6,2024 21:38

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే కలెక్టరేట్‌ ఎదుట 24 గంటల రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఎస్మా ప్రయోగ జిఒ ప్రతులను దహనం చేస్తూ, పచ్చిగడ్డి తింటూ తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమస్యలు పరిష్కరించేంత వరకూ ఎస్మా ప్రయోగించినా గట్టి పోరాటాలతో ఎదుర్కొని సమ్మెను కొనసాగింస్తూ ఉధతం చేస్తామని సిఐటియు రాష్ట్ర ఉఫాధ్యక్షులు జి.ఓబులు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట డి.భాగ్యలక్ష్మి అధ్య క్షతన అంగన్వాడీలు చేపట్టిన 24 గంటల రిలేనిరాహార దీక్షలను ఆయన ప్రారం భించారు. 15 మందితో పాటు ఆయన నిరాహారదీక్ష లో కూర్చున్నారు. వారం దరూ 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11వ తేది ఉదయం 10 గంటల వరకూ దీక్షల్లో ఉంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రా ట్యూటీ అమలు తదితర విషయాల్లో ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు మాట్లాడుతూ సమ్మెకు లబ్దిదారుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను తెరవాలని ప్రభుత్వం నాలుగు శాఖలతో తలకిందులుగా తపస్సు చేసిందన్నారు. వేతనాలు పెంకపోతే ఇతర డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి, కోశాధి కారి పి.బంగారుపాప, ఉపాధ్యక్షులు పి.ఖాజాబీ, లీడర్లు విజయ, అరుణ, పావని, సుమలత, పద్మజ, లక్ష్మిదేవి, విజయమ్మ, రామంజులమ్మ, ప్రవీణ, సబీ నా, రమీజా, ఇందిరమ్మ, పద్మజ, శంకరమ్మ, మంజుల, భూదేవి, సురేఖ రాయచోటి ప్రాజెక్టులోని వర్కర్లులు హెల్పర్లు పాల్గొన్నారు. బి.కొత్తకోట : పచ్చి గడ్డి తింటూ, నలుపు వస్త్రాలు ధరించి అంగన్వాడీలు నిరసనలను తెలియజేశారు. రైల్వేకోడూరు : అంగన్వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌, జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మీ, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు వనజ కుమారి, అధ్యక్షులు, శ్రీరమాదేవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాధా కుమారి, మండల కార్యదర్శి జి.పద్మావతి, వెన్నెల, దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, నాయకులు సరోజ నిర్మల నాగమణి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వ బెదిరింపులకు అంగన్వాడీలు భయపడేది లేదని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సుకుమారి అన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి ఓబులమ్మ, రామాపురం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి మండలాల అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి : రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బందిపై ప్రభుత్వ నిరంకుశ విధానాలను మానుకోవాలని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు, టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్‌ అన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు వారు సంపూర్ణ మద్దతుతెలిపారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనం ఏర్పటు చేశారు. కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, బిసి సెల్‌ అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్‌, మాజీ సర్పంచ్‌ బద్దెల రాజన్న, ముస్లిం మైనారిటీ నాయకులు అన్వర్‌ బాషా పాల్గొన్నారు.ఎస్మా ప్రయోగాన్ని ఖండిస్తున్నాం : సిపిఎంరాయచోటి : అంగన్వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ ప్రభుత్వం జిఒ నెం-2 జారీ చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఖండించారు. విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఎస్మా జిఒను తక్షణమే ఉపసంహరించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని 26 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న అంగన్వాడీలను ఎస్మా చట్టపరిధిలోకి తీసుకువచ్చి సమ్మెను నిషేదించడం అప్రజాస్వామికమన్నారు. సమస్యలు పరిష్కరించకుండా సమ్మె నిషేదిస్తూ, సమ్మె కాలానికి జీతాల్లో కోత విధించడం దుర్మార్గమని తెలిపారు. న్యాయబద్ధమైన సమ్మెను నిరంకుశ చర్యల ద్వారా విచ్ఛిన్నం చేయాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో ఉద్యమాన్ని అణిచివేయాలని చేస్తున్నదని, ఇదే వైఖరి కొనసాగితే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీలపై నిర్బంధించిన ఏ ప్రభుత్వం నిలబడలేదనీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిరంకుశ చర్యను కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని, అంగన్వాడీలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. పుల్లంపేట : నిరంకుశ, నిర్బందాలతో ఉద్యమాన్ని ఆపలేరని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరామయ్య పేర్కొన్నారు.

➡️