కదం తొక్కుతూ..పథం పాడుతూ..

కొయ్యూరులో కబడ్డీ ఆడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృదం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది. సమ్మె శిబిరాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి కేక్‌లను కట్‌ చేశారు. పలు చోట్ల ఆటలతో నిరసనలు తెలియజేశారు. ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. సమ్మెను ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సిఐటియు మండల కార్యదర్శి కొర్ర శంకర్రావు ఆధ్వర్యంలో కొనసాగించారు. సమ్మె శిబిరంలో న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌ చేసి అంగన్వాడీలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాథ్‌, సిపిఎం మండల కార్యదర్శి పాంగి భీమరాజు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, వంతాల లైకోన్‌, అంగన్వాడీల అధ్యక్ష కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పెదబయలు: స్థానిక అంబేద్కర్‌ కూడలి జంక్షన్‌ వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఈ సందర్బంగా ప్రజా సంఘాల నేతలు 2024 ప్రజాశక్తి కేలండర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోండా సన్నిబాబు, సీతగుంట సర్పంచ్‌ పి మాధవరావు, ఎంపీటీసీ కె.బొంజుబాబు, టిఎస్‌ ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు థాంగుల జగత్‌ రారు, సిపిఎం మండల కమిటీ బోండా గంగాధరం, కె శరబన్న, అంగన్వాడీ టీచర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు టి.రాజమ్మ, పద్మ, కూడా కొండమ్మ, సుశీల, మంగ పాల్గొన్నారు.హుకుంపేట: మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మె కొనసాగింది.ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శి టి.క్రిష్ణారావు, సీఐటియు కార్యదర్శి అప్పలకొందపడాల్‌లు కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణారావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సమ్మెను కొనసాగిచంచడం అభినందనీయమన్నారు.3న కలక్టరేట్‌ ముట్టడి కార్యక్రమనికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు అప్పలకొండమ్మ, కృష్ణవేణి, పద్మ, కృష్ణకుమారి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.జిమాడుగుల: మండల కేంద్రంలో అంగన్వాడీలు కోలాటం ఆడుతూ నిరసన చేపట్టారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన్న పడాల్‌, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వి. పండుబాబులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం అంగనవాడి యూనియన్‌ నేతలను పిలిచి సమస్యలు పరిష్కారం చేయకుండా సమ్మెను పక్కదారి మళ్ళించే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అంగనవాడిలు సమ్మె వెంటనే విరమించకపోతే ప్రత్యామ్నాయ విధానాలు చేపడతామని పేర్కొనడం సరికాదన్నారు. కనీస వేతనం ర.26 వేలు, గ్రాడ్యుటీ, మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు కే.బాబురావు, శ్రీను బాబు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్షురాలు మోదకొండమ్మ, వరహాలమ్మ, అన్నపూర్ణ, రాజేశ్వరి, విద్య, కాంతమ్మ, వెంకటలక్ష్మి, సింహాచలం పాల్గొన్నారు అనంతగిరి:అంగన్వాడీల సమ్మె శిభిరాన్ని జెడ్పీటీసీ గంగరాజు సందర్శించి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కనీస వేతనం రూ 26లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి, టోకురు సర్పంచ్‌ కె.మోస్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, గిరిజన సంఘం మండల నాయకులు జె.సుబ్బారావు, ఏపీ ఎంపీటీసీ యూనియన్‌ నాయకులు ఎస్‌.చిన్నారావు, అంగన్వాడి నాయకులు మంజుల, లక్ష్మీ, అరుణకుమారి, సుబ్బమ్మ పాల్గొన్నారు.కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసనకొయ్యూరు : సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలో సోమవారం మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో కబడ్డీ ఆడుతూ వినూత్న నిరసన తెలిపారు. 21వ రోజున సమ్మెకు సంఘీభావం తెలిపి పాల్గొన్న సిఐటియు నేతలు, అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరి వీడి, సమ్మె విరమణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్‌ నేతలు అచ్చియ్యమ్మ, .ముత్యాలమ్మ పాల్గొన్నారు.ముగ్గులు వేసి నిరసనవిఆర్‌.పురం: అంగన్వాడీల నిరవధిక సమ్మె 21వ రోజున సోమవారం మండల కేంద్రంలోని రేఖపల్లి జంక్షన్‌లోని దీక్షాశిబిరం వద్ద ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ 21రోజులుగా అంగన్వాడీ మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే, మాట తప్పిన సిఎం జగన్‌, ప్రభుత్వ పెద్దలు సిగ్గులేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. సిఐటియు జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ, మండల అధ్యక్షులు నాగమణి, మండల కార్యదర్శి రాజేశ్వరి, యూనియన్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.రాజవొమ్మంగి : సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు నూతన ఉత్తేజంతో పోరాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు పిలుపునిచ్చారు. 21వ రోజు అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా బెంగళూరు గృహం ఎదురుగా సమ్మె దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీలు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమ గేయాలకు రోడ్డుపైనే లయబద్ధంగా అంగన్వాడీలు నృత్యాలు చేశారు అంగన్వాడీల ఉద్యమానికి ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కొండ్ల సూరిబాబు, కుంజం జగన్నాధం, డివైఎఫ్‌ఐ నాయకులు టి శ్రీను భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ఎస్‌ వీరబాబు తదితరులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు కె వెంకటలక్ష్మి, సిహెచ్‌ కుమారి, సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు టి శ్రీను, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎల్‌ సత్యవతి, నూకరత్నం, కె లక్ష్మి, చిన్నమ్మలు, రమణి, రమణ, రత్నం పాల్గొన్నారు.రంపచోడవరం : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు రంపచోడవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వంతల రాజేశ్వరి మద్దతు తెలిపారు దీక్ష శిబిరంలోఅంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి మండల అధ్యక్షుడు కారం సురేష్‌ బాబు, ప్రధాన కార్యదర్శి అనంత మోహన్‌, ఐటిడిపి ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ టి సత్తిబాబు, తెలుగు యువత అధ్యక్షులు సిద్ధ వెంకన్న, లంక హరిబాబు, అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు కారం సింహాచలం, యూనిట్‌ ఇంచార్జ్‌ కొంజం బపన్నదొర, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు వై నిరంజన్‌ దేవి, యూనిట్‌ ఇంచార్జి మడకం పండు దొర, మాజీ మండల అధ్యక్షులు ధారా వెంకన్న, చక్రపాణి, నాగిరెడ్డి, కోసు నాగు, జనసేన నాయకులు కురసం చెల్లన్న ధొర, పండ కష్ణమూర్తి, చోడి నరేష్‌ మరి కారం పోతురాజు కారం పోతురాజు, మడి నరసన్న ధర, సారపు జోగిదర, జానకి పాల్గొన్నారు.మారేడుమిల్లి: నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు దీక్షాశిబిరంలో యూనియన్‌ నాయకులు రత్న కుమారి, ప్రసూన ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. దీక్ష శిబిరం వద్ద పాటలు పాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూనవరం : నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం సమ్మె శిబిరం నుండి పంచాయితీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి, అక్కడ పంచాయతీ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ నాయకులు కొమరం పెంటయ్య, యూనియన్‌ కార్యదర్శి లలిత, అధ్యó్యక్షులు అన్నపూర్ణ, కన్నా, అంజు, సావిత్రి లక్ష్మి పాల్గొన్నారు.

➡️