క్రీస్తు మార్గం అనుసరణీయం

ప్రజాశక్తి – ఆచంట

క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఆచంట క్రీస్తు ప్రార్ధనా మందిరంలో గాదిరాజు తిమోతిరాజు అధ్యక్షతన క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ క్రీస్తు బోధనలను అనుసరించడం ద్వారా సమాజంలో శాంతి సామరస్యం ఏర్పడుతుందన్నారు. అనంతరం చిన్నారులతో క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు ఆశీర్వాదం ఆలపించిన క్రైస్తవ పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఎంఎల్‌ఎ శ్రీరంగనాథరాజును, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్‌, సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మట్టా ఆనంద్‌కుమార్‌, కారుమిల్లి వెంకటేశ్వరరావు, ఉషారాణి, కుమారి పాల్గొన్నారు.ఆచంట (పెనుమంట్ర) : ఆలమూరు ఫెయిత్‌ హోమ్‌ చర్చిలో పాస్టర్‌ కొమ్మర డేవిడ్‌ రాజు, విజయ కుమారి హ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి మేడపాటి వెంకటరమణ, త్రిమూర్తులు పాల్గొన్నారు. కాళ్ల: క్రీస్తు మార్గం అనుసరణీయమని కలవపూడి గ్రామ సర్పంచి గేదెల జాన్‌ అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా పలు చర్చిలు విద్యుత్‌ కాంతులతో కళకళలాడాయి. ఈ సందర్భంగా క్రైస్తవసోదరులు చర్చిల్లో ప్రార్థనలు చేశారు. మండలంలో ఏలూరుపాడు, జువ్వలపాలెం, కలవపూడి, కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ల, వేంపాడు, పెదఅమిరం, కోపల్లె, మామిడిపూడి, జక్కరం గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.పాలకొల్లు :క్రిస్మస్‌ సందర్భంగా పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపీ పాల్గొని పిల్లల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇలా పిల్లలతో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆయన వెంట మాజీ డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ యడ్ల తాతాజీ, పెచ్చేటి కృష్ణాజీ, భుజంగరావు, చెన్ను విజరు, మండేలా బుజ్జి, పాలపర్తి కృపానందం పాల్గొన్నారు.మొగల్తూరు : ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాద్‌రాజు అన్నారు. మండలంలోని పాతపాడులో ప్రార్థనా మందిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముందుగా క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలపర్తివారిపేటలోని ప్యారిస్‌ చర్చి ఆవరణలో ఫాదర్‌ గోడి యేసుబ్‌రాజు, కొండావారిపాలెంలోని పారిస్‌-2 లూధరన్‌ చర్చిలో రెవరెండ్‌ ఫాదర్‌’ టి.కొండయ్య మార్టిన్‌ మోజెష్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాలకొల్లు : పట్టణంలోని పలు క్రీస్తు ఆలయాలు కళకళలాడుతున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బెత్లెహాంపేట, శంభునిపేట, క్రిష్టియన్‌పేట, మార్కొపేట చర్చిలు సందడిగా ఉన్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు చర్చిల వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

➡️