ఘనంగా ఓటర్ల దినోత్సవం

Jan 26,2024 00:11
నర్సీపట్నంలో ర్యాలీ చేపడుతున్న ఆర్‌డిఒ, తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగంజాతీయ ఓటరు దినోత్సవాన్ని గురువారం విశాఖ, అనకాపల్లి జిల్ల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఎక్కడికక్కడ ర్యాలీలు తీశారు. ప్రతిజ్ఞలు చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. విశాఖ కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకూ గురికావొద్దన్నారు. గురువారం ఉదయం ఉడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఆనందరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌ పాల్గొన్నారు. గురజాడ కళాక్షేత్రం నుంచి ఉడా చిల్డ్రన్స్‌ ఎరీనా వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంవిపి.కాలనీ : ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు పాల్గొన్నారు. ఎపిఇపిడిసిఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ సిఎమ్‌డి పృథ్వీతేజ్‌ ఇమ్మడి మాట్లాడారు. సంస్థ డైరెక్టర్లు బి.రమేష్‌ ప్రసాద్‌, డి.చంద్రం, ఎవివి.సూర్యప్రతాప్‌, సిజిఎంలు ఎం.రామకృష్ణ, వి.విజయలలిత, జె.శ్రీనివాసరావు, బి.రామచంద్రప్రసాద్‌, డి.సుమన్‌ కల్యాణి, అచ్చి రవికుమార్‌, పి.శ్రీనివాస్‌, ఎస్‌.హరిబాబు పాల్గొన్నారు. సీతమ్మధార : ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కార్పోరేట్‌ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసు ఎపిఇపిడిసిఎల్‌ సిఎమ్‌డి పృథ్వీతేజ్‌ ఇమ్మడి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బి.రమేష్‌ప్రసాద్‌, డి.చంద్రం, ఎవివి సూర్యప్రతాప్‌, సిజిఎంలు ఎం.రామకృష్ణ, వి.విజయలలిత, జె.శ్రీనివాసరావు, బి.రామచంద్రప్రసాద్‌, డి.సుమన్‌ కల్యాణి, అచ్చి రవికుమార్‌, పి.శ్రీనివాస్‌, ఎస్‌.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు. సీతమ్మధారలోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి ఓటర్ల దిన్సోవం గురించి వివరించారు. భీమునిపట్నం : స్థానిక ఎండిఒ కార్యాలయం వద్ద ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యువ ఓటర్లకు తహసీల్దార్‌ సిహెచ్‌వి రమేష్‌ బహుమతులు అందజేశారు. స్థానిక ప్రభుత్వ డైట్‌, జూనియర్‌ కళాశాల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ డి.భాస్కరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనుబాబు, ఎండిఒ డాక్టర్‌ వి.జానకి, ఎంఇఒలు ఎం.శివరాణి, జయప్రద, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పిఓలు వేణుగోపాల్‌, ప్రసాదరావు పాల్గొన్నారు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యాన భీమిలిలో వాలంటీర్లు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్‌ సిహెచ్‌.సూర్య ప్రసాద్‌ పాల్గొన్నారు.అవంతి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఎ.అర్జునరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాధిపతి ఎస్‌.షరీఫ్‌ పాల్గొన్నారు. సింగనబంద పంచాయతీ కృష్ణంరాజుపేటలో ఎంపి ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవం నిర్వహించారు ములగాడ: స్థానిక సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యాన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి వై.అనసూయదేవి, ఎన్‌. నదియా, వి.అంజలీదేవి, ఎ.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కరాస: గోపాలపట్నం తహశీల్దార్‌ కార్యాలయం ఆధ్వర్యాన 52వ వార్డు శాంతినగర్‌ సామాజిక భవనంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌, ఎమ్మెల్యే గణబాబు, డిప్యూటీ మేయర్‌ జియ్యని శ్రీధర్‌, కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ ములగాడ తహశీల్దార్‌ వీరభద్రరావు, జోనల్‌ కమిషనర్లు మల్లయ్యనాయుడు, ఆర్‌జివి కృష్ణ, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ బిఎస్‌.కృష్ణ పాల్గొన్నారు.ఓటేయడం అందరి బాధ్యతజిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిఅనకాపల్లి:ఎన్నికల్లో ఓటేయడం అందరి బాధ్యత అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్‌ మైదానం నుండి రోటరీ క్లబ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అందరి చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోటరీ క్లబ్‌లో ఆడారి బంగారమ్మ, కొణతాల అప్పలనరసమ్మ తదితర వృద్ధ ఓటర్లను, పి.వీరూయాదవ్‌, ఎం.చంద్రశేఖర్‌, వై.రవి తదితర వికలాంగ ఓటర్లను సన్మానించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్పీ కెవి.మురళీకృష్ణ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్‌రావు, జెసి ఎం.జాహ్నవి, అడిషనల్‌ ఎస్పీ బి.విజయ భాస్కర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.స్మరణ రాజ్‌, డిఆర్‌ఒ బి.దయానిధి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక డైట్‌ కళాశాలలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుజాత, అసిస్టెంట్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామర్‌ ఆఫీసర్‌ రమేష్‌, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలెంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.చోడవరం : ఉషోదయ కాలేజీ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల డీన్‌ వెంకట వాసు, హెచ్‌డిటి లక్ష్మీనారాయణ, ఎన్నికల అధికారి డి.లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ పి.వెంకటగిరి, జూనియర్‌ అసిస్టెంట్‌ పి.వెంకటేష్‌, కృష్ణారావు, ఉషోదయ ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి అప్పలనాయుడు పాల్గొన్నారు.కె.కోటపాడు : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన సదస్సులో మాడుగుల నియోజకవర్గ ఎన్నికల అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ టి.రాజు మాట్లాడారు. తహసీల్దార్‌ రమేష్‌ బాబు, ఎంపీడీవో ప్రసాద్‌, ఎంఈఓ డివిడి ప్రసాద్‌, ఇన్చార్జి హెచ్‌ఎం పద్మావతి పాల్గొన్నారు.సబ్బవరం : స్థానిక డిప్యూటీ తహసీల్దార్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో మండల పరిషత్‌ కార్యాలయం నుండి మూడు రోడ్డుల జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారం చేపట్టారు. ఓటు హక్కును వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎఓ షేక్‌ బాబురావు, ఆర్‌ఐ వీరయ్య పాల్గొన్నారు.దేవరాపల్లి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా ముగ్గురు వృద్ధ ఓటర్లను సన్మానించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎం.లక్ష్మి, ఎంపీడీవో సిహెచ్‌.సుబ్బలక్ష్మి ఎంఈఓ పడాల్‌దాస్‌, జివి.రమణ పాల్గొన్నారు.బుచ్చయ్య పేట : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ అరుణచంద్ర ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ను సత్కరించారు.వడ్డాది : బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట ఎల్బీపి అగ్రహారం, గంటికొర్లం తదితర పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి పురవీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. కో-ఆపరేటివ్‌ అధ్యక్షులు సాయం రమేష్‌, సర్పంచ్‌లు మెరుగు కుమారి బాబురావు, శరకన బాబురావు, ఎంపిటిసి ఎల్లపు జగ్గారావు, వీఆర్వో సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ సతీష్‌ పాల్గొన్నారు.కశింకోట : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్స్‌ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎంఆర్‌వి.అప్పారావు, పిడి వి.ప్రభాకర్‌, బి.అప్పారావు, ఆచంట నాగేశ్వరావు, ఆచంట రవి పాల్గొన్నారు. నక్కపల్లి:ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్‌ అంబేద్కర్‌ కోరారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సీనియర్‌ సిటిజన్‌లను ఘనంగా సత్కరించారు.ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, వైస్‌ ఎంపీపీలు నానాజీ, ఈశ్వరరావు, ఏవో సీతారామరాజు, ఎంఈఓ కె.నరేష్‌, హెచ్‌. ఎమ్‌.రాణీలలిత, ఎన్నికల డీటీ. తాతాచార్యులు, ఎంపీటీసీ సభ్యులు గంటా తిరుపతిరావు ,తెలుగు ఉపాధ్యాయులు ఎన్‌.వి.ఎస్‌.ఆచార్యులు పాల్గొన్నారు.పెదబోదుగల్లం హైస్కూలులో మానవహారం చేశారు. స్వస్తిక్‌ ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.నర్సీపట్నం టౌన్‌:మండల కేంద్రంలో ఆర్డీవో సిహెచ్‌ జయరాం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక శ్రీ కన్య కూడలి నుండి శారదా నగర్‌, వెంకునాయుడుపేట, పాల్‌ ఘాట్‌ సెంటర్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఆర్డీవో జయరాం, తహసిల్దార్‌ అన్నాజీరావు, ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ సూర్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు పాల్గొన్నారు. మాడుగుల:స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ, బస్టాండ్‌ ఆవరణలో మానవహారాన్ని నిర్వహిం చారు. ఉపాధ్యాయుడు బాబి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్‌ పీవీ రత్నం, డిటిఓ సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ టీ.నాగేశ్వరరావు, ఆర్‌ఐ ఎడ్ల వెంకటేష్‌ పాల్గొన్నారు. కోటవురట్ల: మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో అధికారులు ఓటు హక్కు వినియోగం పై ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో తహసిల్దార్‌ జానకమ్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల నుండి రాలీ నిర్వహిస్తూ ప్రధాన కూడలి వద్ద మానవహారం చేపట్టారు. పొందూరు గ్రామంలో ఓటు హక్కు వినియోగంపై ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. స్థానిక ఎస్సై రమణయ్య, ఉప తహసిల్దార్‌ సోమశేఖర్‌ పాల్గొన్నారు.గొలుగొండ: మండలంలో జోగంపేట సెంటర్లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. స్థానిక హైస్కూలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ సత్యనారాయణ, హెచ్‌ఎం వి.సరోజినీ పాల్గొన్నారు.

➡️