తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు

Feb 14,2024 21:20
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు

జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులుప్రజాశక్తి- వికోట: రాబోవు వేసవిని దష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని కష్ణాపురం సచివాలయం, ఆర్బికే కేంద్రాలను బుధవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అదేవిధంగా రాబోవు వేసవిని దష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన నిధులు సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు వాటిని అందించాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు సక్రమంగా అందించాలన్నారు. నిర్మాణంలో ఉన్న జగనన్న గహాలను వేగవంతం చేసి పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

➡️