దళితుని మృతిపై కొనసాగుతున్న విచారణ

Mar 25,2024 01:02

దళితుని మృతిపై కొనసాగుతున్న విచారణ ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, గంగాధర నెల్లూరు : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం పాచిగుంట దళితవాడకు చెందిన సుధాకర్‌ అనుమా నాస్పద మృతిపై విచారణ కొనసాగుతున్నట్లు వన్‌టౌన్‌ సిఐ విశ్వనాధ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నాగరాజు, రఘులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, సుధాకర్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అందిన తర్వాత అతిగా మద్యం సేవించి మతి చెందాడా? హత్య అనే విషయం తెలిసే అవకాశం ఉందని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగరాజు, రఘులను రిమాండ్‌కు తరలించారు.స్వగ్రామంలో సుధాకర్‌ అంత్యక్రియలు మండలంలోని పాచిగుంట దళితవాడకు చెందిన సుధాకర్‌ మృతి అనుమానాస్పదం కావడంతో శనివారం చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి వారు పాచిగుంటకు సుధాకర్‌ మృతదేహాన్ని తరలించి ఆదివారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.

➡️