పండుగ వేళ సరుకుల గోలసర్కారు తీరుతో సంసారాల్లో లొల్లిప్

పండుగ వేళ సరుకుల గోలసర్కారు తీరుతో సంసారాల్లో లొల్లిప్

పండుగ వేళ సరుకుల గోలసర్కారు తీరుతో సంసారాల్లో లొల్లిప్రజాశక్తి -తిరుపతి సిటీ సంక్రాంతి పండగ సందర్భంగా సరుకులు కొనాలి అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన ధరలు ఇబ్బందికరంగా మారింది. గత నెల రోజులుగా కార్మికుల సమ్మె బాట పట్టడంతో, వేతనాలు లేక, భార్య పిల్లలకి కనీసం కడుపునిండా తిండి పెట్టలేక కాపురాల్లో గొడవలు ఏర్పడ్డాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ తీరే కారణం కావడం గమనార్హం. సంక్రాంతి, కనుమ తెలుగు వారి ముఖ్య పండగలు.. పేదవారు సైతం, అల్లుళ్లు, కోడలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని భావిస్తారు. కానీ మధ్యతరగతి ప్రజలు సైతం ఈ పండలను జరుపుకోవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. మాంసాహారం మాట దేవుడెరుగు.. కనీసం కూరగాయలు, ఆకుకూరలతో వచ్చిన బంధువులకి సంతప్తిగా భోజనం పెట్టాలన్నా ఇబ్బందిగా మారింది. మార్కెట్లో కిలో వంకాయలు రూ.60లు, కిలో బెండకాయ రూ.120లు, బీన్స్‌ కిలో 80, క్యారెట్‌ కిలో 50, ఉల్లిగడ్డ కిలో 40, పచ్చిమిర్చి కిలో 60, టమోటా కిలో 30, గోంగూర కట్ట పది రూపాయలు, ఆకుకూర కట్ట 20, పుదీన కట్ట 10, తెల్ల గడ్డలు కిలో రూ.400లు, ఎండి మిరపకాయలు కిలో రూ.400, బెల్లం కిలో రూ.60, చక్కెర కిలో రూ.48, బియ్యం కిలో రూ.66లు, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో రూ.160లు ఇలా నిత్యావసర సరుకులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగువారికి అతి ప్రాముఖ్యమైన సంక్రాంతి పండుగను సైతం, పేదవారు సామాన్యులు జరుపుకునేని పరిస్థితి ఏర్పడింది. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, సర్వ శిక్షణ కేంద్రం సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు, 104, 108, 102 సిబ్బంది ఇలా రకరకాల విభాగాలు చెందిన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి సమస్యలపై స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు, రెచ్చగొట్టే ధోరణి ప్రవర్తించడంతో కనీసం వారికి వేతనాలు కూడా అందుబాటులోకి రావడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే పండుగలు ఎలా జరుపుకోవాలని పాలకుల తీరు వల్ల, అహర్నిశలు కష్టపడే కార్మికుల బతుకులు, సంక్రాంతి పండుగ సందర్భంగా చీకటి అలుముకుంది. పండగలు సైతం పట్టించుకోకుండా కార్మికులు తమ జీవితాలు బాగుపడితే చాలునని ఆందోళన పట్టడానికి ప్రభుత్వ తీరే కారణం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు ఓట్ల రాజకీయాలకు పాల్పడడమే నిదర్శనం. ఇప్పటికైనా పాలకులు స్పందించి, కార్మికులు చేపట్టిన న్యాయమైన ఉద్యమ పరిస్థితులను గుర్తించి, వారికి న్యాయం చేసేందుకు కషి చేయాలని, వారి కుటుంబాలు సైతం బాగుపడేందుకు సహకరించాలని పలువురు మేధావులు కోరుతున్నారు.

➡️