బాలికపై అత్యాచారం

నినాదాలు చేస్తున్న ఐద్వా నేతలు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:అల్లూరి జిల్లా అరకువేలి మండలంలో బాలికలపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని చోంపి గ్రామంలో 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన గెమ్మెలి చరణ్‌ అత్యాచారం చేశాడు.ఈ సంఘటన గత నెల 28న చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి నిందితుడిని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.నిందితుడిని శిక్షించాలి: ఐద్వా బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వివి జయ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఈ సంఘటనపై ఐద్వా నేతలు గ్రామంలో సందర్శించి బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. అనంతరం అరకువేలి మండలం ఆదివాసీ గిరిజన సంఘం భవనం నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.తహశీల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయ మాట్లాడుతూ, బాలికపై అత్యాచారానికి పాల్పడిన గెమ్మెలి చరణ్‌ పై నిర్భయ చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిరుపేద కుటుంబం అయిన బాలిక తండ్రికి ఉపాధి కల్పించాలన్నారు. బాధితురాలు ఆరోగ్యవంతురాలుగా తిరిగేంతవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత వికలాంగ బాలిక నడవలేని పరిస్థితి వికలాంగులు అయినటువంటి బాలికకు అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం జిల్లా కమిటి సభ్యులు జి సన్యాసమ్మ, చొంపి సర్పంచ్‌ కె సుభద్ర, ఎంపీటీసీ సోమెల జానకి,లక్ష్మి,బి సన్యాసమ్మ,పి సుశీల, సోమల మొత్తి, సిహెచ్‌ బుల్లమ్మ, వార్డు సభ్యులు కోగేశ్‌, ఆదివాసీ గిరిజన సంఘం మండల అద్యక్షుడు జి బుజ్జి బాబు,గ్రామ యువతలు పాల్గొన్నారు.

➡️