బిజెపిని సాగనంపితేనే దేశం ముందుకు

Feb 17,2024 00:00

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా విలేకర్లు : వ్యవసాయ రక్షణ, కార్మిక హక్కుల కోసం దేశ వ్యాప్త పిలుపులో భాగంగా పల్నాడు జిల్లాలోని పలు గ్రామాల్లో బంద్‌ పాటించారు. పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నాయకులు దుయ్యబట్టారు. ఇందులో భాగంగా ముప్పాళ్ల మండలం మాదలలో ప్రధాన రహదారిపై బంద్‌ చేపట్టారు. మండల కేంద్రమైన యడ్లపాడులో పిఆర్‌ విజ్ఞాన కేంద్రం నుండి ప్రదర్శనగా బయలుదేరిన కార్యకర్తలు పోస్టాఫీసు మార్గంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. చిరు వ్యాపారులు ఉదయం నుండే వ్యాపారాలను మూసేసి బంద్‌కు సహకరించారు. మాదలలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, యడ్లపాడులో కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు 14 నెలల పాటు చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, ఆ చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. ఈ సందర్భంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తానని, పోరాట కాలంలో చనిపోయిన రైతు కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే వాటిని ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నీరుగారుస్తూ నాలుగు లేవర్‌ కోడ్‌లు తెచ్చిందని, ఉపాధి హామీ చట్టాలనికి తూట్లు పొడుతోందని మండిపడ్డారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు రాయితీలిస్తూ సామాన్యులపై పన్నులు, ధరల భారం మోపుతోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను విస్మరించిందని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడంలో భాగంగా విశాఖ ఉక్కునూ అమ్మబూనుకుందని చెప్పారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన మాట్లాడడం లేదని, ఈ నేపథ్యంలో ఈ అన్ని పార్టీలపై ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ, కె.రోశయ్య, వివిధ సంఘాల నాయకులు సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు, సైదాఖాన్‌, జి.జాల య్య, ఐ.సత్యనారాయణరెడ్డి, ఎన్‌.సాంబశివ రావు, టి.అమరలింగేశ్వరరావు, కె.నాగేశ్వరావు, టి.బ్రహ్మయ్య, టి.మస్తాన్‌రావు, సాంబశివరావు, ఎన్‌.తులశయ్య, జి.హరిబాబు, కె.రామారావు, కె.వెంకటరావు, ఎన్‌.కాళిదాసు, ఎం.పద్మారావు, ఎ.సుబ్బారావు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో స్థానిక పుతుంబాక భవన్‌ నుండి గార్లపాడు బస్టాండ్‌ సెంటర్‌, గడియార స్తంభం సెంటర్‌ మీదుగా తాలూకా సెంటర్‌ వరకు ప్రదర్శన చేశారు. తాలూకా సెంటర్లో కౌలురైతు సంఘం మండల అధ్యక్షులు పి.మహేష్‌ అధ్యక్షతన సభ నిర్వహించగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడారు. స్వామినాథన్‌కు భారతరత్న అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణ కోసం గిట్టుబాటు ధర కల్పించాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను తుంగలోతొక్కిందని విమర్శిం చారు. రైతులు, కౌలు రైతులు, కార్మికుల కష్టాలు, కష్టజీవుల కష్టాలు పోవాలంటే కేంద్రంలోని మోడీని సాగనంపాల్సిందేనని, మోడీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య, సిఐటియు నాయకులు గుంటూరు విజయకుమార్‌, ఎఐటియుసి నాయకులు ఎన్‌.వేణుగోపాల్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.మల్లీశ్వరి మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేయాలని, కేరళ తరహా రుణ ఉపశమనం చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంఘాల నాయకులు జి.రజని, డి.విమల, జి.ఉమశ్రీ, ఆర్‌.పూర్ణయ్య, ఐ.లింగయ్య, ఎం.నరసింహారావు, బి.రామారావు, పి.సూర్య ప్రకాశరావు, ఎం.వెంకటనారాయణ, జె.రాజ్‌కు మార్‌, కె.జగన్‌, బి.వెంకటేశ్వర్లు, సిహెచ్‌.లక్ష్మీనా రాయణ, వీరమ్మ, జె.భగత్‌ పాల్గొన్నారు. పిడుగురాళ్లలోని తహశీల్దార్‌ కార్యాలయం నుండి హైలాండ్‌ సెంటర్‌ వరకు రైతులు, కార్మికులు భారీ ప్రదర్శన చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తానని, నిరుద్యోగ సమస్య పారదోలుతామని నమ్మబలికిన మోడీ పాలనలో లక్షన్నర మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిందని విమర్శించారు. వీటిపై ప్రజల దృష్టి పడకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, దేశాన్ని నిట్టనిలువునా చీలుస్తోందని మండిప డ్డారు. దేశానికి ప్రమాదకరంగా మారిన బిజెపిని, ఆ పార్టీకి అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేనను ఓడించాలని కోరారు. ఎఐఎఫ్‌టియు నాయకులు ఎన్‌.రాంబాబు, సిపిఐ నాయకులు ఎస్‌కె హసన్‌ మాట్లాడుతూ రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే వారిపై తీవ్ర నిర్బంధకాండకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. టి.శ్రీనివాసరావు, బి.వెంకటేశ్వ ర్లు, ఎస్‌.వెంకటకృష్ణ, బి.నాగేశ్వరరావు, కె.చెన్నయ్య, సుధాకర్‌, సుజాత, సరస్వతి, శివలక్ష్మి, బషీర్‌, రామకృష్ణ, సుందర్‌రావు, కోటిరెడ్డి పాల్గొన్నారు. రొంపిచర్లలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్‌ చేశారు. పోస్టాఫీసును మూసేయించారు. ఎస్‌.వెంకటేశ్వ రరాజు, బి.నాగేశ్వరరావు, సత్యనారాయణరాజు, పి.రామిరెడ్డి, ఎస్‌.తిమ్మరాజు, ఎం.మధుసూదన రావు, హుస్సేన్‌ పాల్గొన్నారు. దాచేపల్లిలో ప్రదర్శన చేశారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కె.వెంకట్రావు, సిపిఐ నాయకులు హుస్సేన్‌ మాట్లాడారు. ఎం.రమ ణారెడ్డి, వి.వెంకటరెడ్డి, మురళి కృష్ణారెడ్డి, సత్యనారాయణ, ఎల్‌.శాంతి, రామయ్య, నాగరాజు, భాస్కర్‌రావు, ఆనందకుమార్‌, నవజ్యోతి, వెంకటేశ్వరరావు, జానీ పాల్గొన్నారు. నకరికల్లులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ పంటలకు మద్దతు ధరలు కల్పించి వ్యవసాయాన్ని, రైతులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని, ఏడాదికి 200 పని దినాలు కల్పించి రోజు కూలి రూ.600 ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. నాయకులు పిచ్చారావు, ఇ.అప్పిరెడ్డి, లక్ష్మారెడ్డి, కోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌.రామాంజి నాయక్‌, జి.చిన్ని, పిడిఎం జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి, జి.కుమారి, మంగమ్మ, జి.బాల, మాణిక్యరావు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంతోపాటు మండలంలోని వేలూరు, కమ్మవారిపాలెం, ఎండుగంవారిపాలెంలో బంద్‌ పాటించారు. చిలకలూరిపేటలో ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి రిజిస్ట్రార్‌ కార్యాలయం, రథం సెంటర్‌, గడియారం స్తంభం మీదుగా కళామందిర్‌ సెంటర్‌ వరకు కార్మికులు, రైతులు భారీ ప్రదర్శన చేశారు. వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీలో రైతులపై జరుగుతున్న నిర్బంధాన్ని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల్లోని నల్ల ధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాలోల వేస్తామని నమ్మించిన మోడీ తన పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తు న్నారని, కార్పొరేట్లకు మరింతగా దోచి పెడుతు న్నారని విమర్శించారు. నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌రావు, పి.వెంకటేశ్వర్లు, ఎం.రాధాక ృష్ణ, బి.శంకర్రావు, ఎన్‌.కాళిదాసు, ఎన్‌.సుబ్బా యమ్మ, పి.రామారావు, ఎస్‌.బాబు, ఎం.విల్సన్‌, బి.కోటానాయక్‌, టి.ప్రతాప్‌రెడ్డి, ముత్తయ్య, బి.భగత్‌సింగ్‌, సిహెచ్‌.నిర్మల, వరహాలు, గౌస్‌ పాల్గొన్నారు. అచ్చంపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడారు. వివిధ సంఘాల నాయకులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఆర్‌.నాగేశ్వరరావు, కె.గోపికృష్ణారెడ్డి, వి.ఫ్రాన్సిస్‌, కె.నాగ సంధ్య, పుష్పలత పాల్గొన్నారు. క్రోసూరులో నిరసన ప్రదర్శన చేశారు. జి.రవిబాబు మాట్లాడారు. కారంపూడిలో బంద్‌ పాటించారు. సిపిఐ మండల కార్యదర్శి షేక్‌ సైదా మాట్లాడారు. సంఘాల నాయకులు ఎస్‌.శ్రీనివాస్‌రావు, కె.వెంకట శివయ్య, ఐ.శ్రీనివాసరావు, సుభాని, ఎన్‌.వెంకటేశ్వర్లు, సూర్య హనుమంతరావు, జె.కోటేశ్వరావు, సైదాబీ, రామ్మూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, సుబ్బారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. మాచర్ల పట్టణంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన, బస్టాండ్‌ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ డాక్టరు వై.రామచంద్రారెడ్డి, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, నాయకులు బి.మహేష్‌, సిపిఐ ఏరియా, పట్టణ కార్యదర్శులు ఎం.శ్రీనివా సరెడ్డి, బాబురావు, సిటియు నాయకులు అబ్రహం లింకన్‌ మాట్లాడారు. వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో మానవ హారంగా ఏర్పడ్డారు. ఎఐటియుసి వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి యు.రాము సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి మాట్లా డారు. నాయకులు ఎస్‌.సైదా, పి.లాల్‌ఖాన్‌, బి.సాగర్‌ బాబు, పి.వెంకటేశ్వర్లు, రామారావు, వందనం, పవన్‌ కుమార్‌, శశి కుమార్‌, షేక్‌ కిషోర్‌, బి.వెంకటేశ్వర్లు, ముని వెంకటేశ్వర్లు, రంజాన్‌ బి, నాసర్‌ బి, ఫిరోజ్‌ పాల్గొన్నారు. అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బి.సూరిబాబు, బి.రామకృష్ణ, ఎం.శ్రీనివాసరావు, బి.వెంకటేశ్వర్లు, కె.చెన్నకేశవ రావు, మోదిన్‌వలి, నవీన్‌, బి.రామయ్య, ఉదరు శేఖర్‌, రాంబాబు, ఎన్‌.రవికుమార్‌, ఎస్‌.విజరు, బి.విశ్వనాథం పాల్గొన్నారు.

➡️