రెండో రోజూ తపాలా ఉద్యోగుల సమ్మెఅర్ధనగంగా మోకాళ్లపై నిలబడి నిరసన

రెండో రోజూ తపాలా ఉద్యోగుల సమ్మెఅర్ధనగంగా మోకాళ్లపై నిలబడి నిరసన

రెండో రోజూ తపాలా ఉద్యోగుల సమ్మెఅర్ధనగంగా మోకాళ్లపై నిలబడి నిరసనప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌: ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్స్‌ తపాలా ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండోరోజు బుధవారం కొనసాగింది. స్థానిక తపాలా డివిజన్‌ కార్యాలయం వద్ద తపాలా ఉద్యోగుస్తులు అర్థనగంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు ఎం.మురళి, కె.నాగయ్య, కన్వీనర్‌ శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. అదనపు సర్వీస్‌ ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ రూ.5లక్షలు పెంచాలని, గ్రాజివిజీ రూ.5లక్షలకు పెంచాలని, ఉద్యోగితోపాటు కుటుంబ సభ్యులతో సహా వైద్యసౌకర్యాలు కల్పించాలని కోరారు. తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️