వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

Jan 28,2024 16:52 #ap assembly, #meetings

అమరావతి: ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు ఓటాన్‌ అకౌంట్‌ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

➡️