వెనక్కి తగ్గం..

అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. గురువారం పదో రోజు వినూత్నంగా నిరసన తెలియజేశారు. తమ డిమాండ్లు తీర్చేందుకు ప్రభుత్వం దిగొచ్చే వరకూ వెనక్కి తగ్గేదే అంటూ ఆందోళన చేపడుతున్నారు. కడప అర్బన్‌ :రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులుగా అంగన్వాడీలో సమ్మె చేస్తుంటే సిఎం జగన్మోహన్‌ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. లక్షా పదివేల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు కన్నీరు కారుస్తే మంచిది కాదని పేర్కొన్నారు. శాంతి యుతంగా సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. సిఎం స్పందించకపోతే ఓటు అనే ఆయుధంతో అంగన్వాడీలు తమ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణు ప్రియతమ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ఎన్‌ఎ స్‌యు ఐ బాబు, యూత్‌ కాంగ్రెస్‌ మధు రెడ్డి, చీకటి చార్లెస్‌, అలీ ఖాన్‌, లక్ష్మయ్య, నరసింహులు, పాలగిరి శివ, బాష, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అర్బన్‌ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి అంజలీదేవి, డివైఎఫ్‌ఐ నగర్‌ కార్యదర్శి ఓబులేసు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. వేంపల్లె : అంగన్వాడీలకు వేతనాలు పెంచే వరకు ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య పేర్కొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె గురు వారం నాటికి 10వ రోజు చేరింది. విన్నూతంగా అంగన్వాడి మహిళాలు అందరూ వేంపల్లెలోని పాపాఘ్ని నదిలోకి వెళ్లి జల దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభు త్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జల దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజులా సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, ఏరియా కార్యదర్శి వెంకట రాములు, సిఐటియు నాయకురాలు లలితామ్మ, సావిత్రి, ఎఐటియుసి నాయకులు సరస్వతి, శైలజాలతో పాటు అంగన్వాడీలు పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభించి 10 రోజులు అయిన సందర్భంగా గురువారం పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 10 ఆకారంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం కడప పార్లమెంట్‌ సభ్యులు అవినాష్‌రెడ్డిని కలిసి తమ సమస్య లను వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈనెల 25న ముఖ్యమంత్రి పులివె ందులకు వస్తారని మీ సమక్షంలోనే మీ సమస్యలను వివరిస్తానని హామీ ఇచ్చారు. మైదుకూరు : ‘జగనన్నా.. మీకు కేకులు మాకు గడ్డి’ అంగన్వాడీ కార్యకర్తలు గడ్డి తిని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.శివకుమార్‌ మాట్లాడుతూ 10 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. పాదయాత్రలో జగన్‌ రెడ్డి ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని, సిఎం జగనన్న అంగన్వాడీ మహిళల పట్ల కనికరం చూపి జీతాలు పెంచడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి శ్రీరాములు, మండల కార్యదర్శి షరీఫ్‌, మండల సభ్యులు జహంగీర్‌బాష, సుధా కర్‌, సిఐటియు, ఎఐటియుసి, సభ్యులు భారతి, ధనలక్ష్మి, చెన్నమ్మ, శోభ, రజియా, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి, రమాదేవి, శివలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, జ్యోతి, అనూష పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట 10వ రోజు అంగన్వాడీ చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఆయన నిలిచారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి పాల్గొన్నారు.అంగన్వాడి వర్కర్లను వేధించడం తగదని, రాయల సీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాపరెడ్డి,రాయలసీమ విద్యార్థి సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ 10 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా వారిని చర్చలకు పిలిచి వారి జీతాల విషయం మాట్లాడకపోవడం బాధాకరమని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. గ అంగన్వాడీలు పట్టణంలో భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీలకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి భోజన వసతి కల్పించారు. ఆయన సతీమణి మౌనిక, అక్క హరిత వారికి మద్దతు పలికారు. 21 పిడి టిఆర్‌ పుట్టపర్తి సర్కిల్‌ భిక్షాటన చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు చాపాడు : తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని పదో రోజు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసనచేపడుతున్నారు. సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. గ్రామంలో దుకాణాలు గహాల వద్దకు భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు సుజాత, అరుణ ,రామలక్ష్మి, రాధా, సరస్వతి, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల :పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు మండల నాయకులు బొజ్జా చిన్నయ్య అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోకిలంపాడు. శ్రీనువాసులు , జిల్లాకమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, అంగన్డాఈ ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, వినోదా, దస్తగిరిమ్మ, రేణుక, విజయమ్మ, జ్యోతిమ్మ ,రమాదేవి, శ్రీదేవి ,లక్ష్మీదేవి 200మంది అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడి వర్కర్లు, సిఐటియు చిన్నయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగు : స్థానిక ఐసిడిఎస్‌ ఆఫీసు ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు అనుబంధం వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 10 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా బిక్షాటన చేపట్టారు. బిక్షాటనతో అయినా ప్రభుత్వానికి కనివిప్పు కలగాలని సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా సహాయక కార్యదర్శి వినరు కుమార్‌ అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి సుబ్బారెడ్డి, చాంద్‌ బాషా, నరసమ్మ. సిఐటియు నాయకులు కులాయమ్మ లక్ష్మీదేవి పాల్గొన్నారు.

➡️