శిరీషబాయి మతికి కారకులను శిక్షించాలి

Feb 24,2024 19:33

దళిత ,గిరిజన, ప్రజాసంఘాల, ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన

శిరీషబాయి మతికి కారకులను శిక్షించాలి

ప్రజాశక్తి – ఆత్మకూర్‌

గిరిజన మహిళ శిరీషబాయి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని శనివారం నాడు పాత బస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తూ నిరసన తెలియజేశారు. బీసీ సంఘం నాయకులు డాక్టర్‌ నాగన్న, మాల మహానాడు నాయకులు ముర హారి, మల్లయ్య, శీలం శేషు, ఎమ్మార్పీస్‌ జిల్లా అధికార ప్రతినిధి దరగయ్య, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహర్‌ నాయక్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు బుజ్జన్న ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు రామ్‌ బాలాజీ నాయక్‌ , ఏపీ గిరిజన సంఘం నాయకులు నరసింహ నాయక్‌ పాల్గొని మాట్లాడారు. ఆత్మకూరు మండలం సంజీవ నగర్‌ తాండకు చెందిన బాలాజీ నాయక్‌ రత్నాబాయి దంపతుల కుమార్తె శిరీషబాయిని, పాణ్యం సుగాలిమెట్ట గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ నాయక్‌ (రైల్వేశాఖ టీసీ)తో 2023వ సంవత్సరం జూన్‌ నెలలో వివాహం జరిగిందని రూ.20 లక్షల రూపాయలు,25తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇవ్వగా అదనపు కట్నం కోసం నిత్యం భర్త,అత్త,మామ,మరిది, వేధింపులకు గురి చేశారన్నారు. బుధవారం నాడు కర్నూలు పట్టణంలో రాత్రిపూట శిరీషబాయిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, శిరీషబాయి మరణానికి కారణమైన భర్త శ్రీ కాంత్‌ నాయక్‌,మామ తిరుపాల్‌ నాయక్‌,అత్త రుక్మిణీబాయి,మరిది పురేంద్ర నాయక్‌ ను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. న్యాయం చేయాలని ధర్నా చేసిన తల్లిదండ్రులు, బంధువులు,కుల సంఘాల నాయకులపై దాడికి పాల్పడిన సిఐ, ఇద్దరు ఎస్సైలు,నలుగురు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. లేనిపక్షములో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మాల మహానాడు,గిరిజన నాయ కులు నాగయ్య నాగస్వామినాయక్‌,రమేష్‌ నాయక్‌, వెంకటశివ నాయక్‌,రామారావు, ముంతన్న,పెద్దపుల్లన్న, మల్లికార్జున నాయక్‌, పాల్గొన్నారు.

➡️