ప్రజామోదయోగ్యంగా మ్యానిఫెస్టో

  • టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి మ్యానిఫెస్టో ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలు చెబుతున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఈ మ్యానిఫెస్టోతో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. జూమ్‌ యాప్‌ ద్వారా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహజ వనరులను ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి చాలా ఆదాయం చేకూరుతుందని తెలిపారు. ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రైవేటుపరమవుతున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించి ఆదాయం పెంచవచ్చని తెలిపారు.
రైతులకు పెద్దపీట : శ్రీనివాసరెడ్డి
రైతులకు టిడిపి పెద్దపీట వేస్తుందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకూ నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ అవగాహన లోపం, బాధ్యతా రాహిత్యంతో వ్యవసాయ రంగం కుదేలైందని విమర్శించారు. హిందువులు, బ్రాహ్మణులకు కూటమి అద్భుత హామీలిచ్చిందని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజరుకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

➡️